వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నా హజారే డెడ్‌లైన్ ఆగస్టు 30వ తేదీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Anna Hazare
న్యూఢిల్లీ: జన్ లోక్‌పాల్ బిల్లు ఆమోదానికి సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆగస్టు 30వ తేదీని డెడ్‌లైన్‌గా విధించారు. 30వ తేదీలోగా ప్రభుత్వం పార్లమెంటులో జన్‌ లోక్‌పాల్ బిల్లును ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే పార్లమెంటు సభ్యులను ఘెరావ్ చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. రామ్‌లీలా మైదానంలో దీక్ష చేస్తున్న అన్నా హజారే - మద్యం తాగి దీక్షాస్థలికి రావద్దని ప్రజలను కోరారు. జన్ లోక్‌పాల్ బిల్లుపై ప్రభుత్వం సామాజిక కార్యకర్తలను మాత్రమే కాకుండా అందరినీ మోసం చేస్తోందని ఆయన విమర్శించారు.

జన్ లోక్‌పాల్ బిల్లును ప్రతిపాదించకపోతే పార్లమెంటు సభ్యుల ఇళ్ల ముందు ధర్నాలు చేయాలని ఆయన ప్రజలను కోరారు. బిల్లును ప్రతిపాదించకపోతే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వంలోని ఐదారుగురు మాత్రమే దేశాన్ని నడుపుతున్నారని, వారికి సామాజిక - జాతీయ దృక్పథం లేదని, అప్పుడు ఈ దేశం ఏమవుతుందని, ఇదే ఆందోళన కలిగించే విషయమని ఆయన అన్నారు.

English summary
Anna Hazare on Tuesday stuck to his August 30 deadline for passage of Jan Lokpal Bill and asked his supporters to intensify the protest by gheraoing the houses of Parliamentarians if government failed to do so.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X