అన్నా దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వం, డిమాండ్లకు ఓకే

అన్నా హజారే దేశంలో అవినీతిపై ప్రజలలో గతంలో ఎన్నడూ లేనంతటి స్పృహ కలిగించారని ప్రధాని గురువారంనాడు పార్లమెంటులో ప్రశంసించారు. శుక్రవారంనాడు పార్లమెంటులో ఏయే అంశాలను చర్చించేదీ గురువారం సాయంత్రం ఏ క్షణాన్నయినా కేంద్రం ప్రకటించే అవకాశం ఉంది. ప్రధాని వైఖరితో ఇంతకుముందు అన్నా హజారేను విమర్శించినవారు చెంపలు వేసుకున్నారు. అన్నా హజారే దీక్ష గురువారానికి పదవ రోజుకు చేరుకున్నది. అన్నా ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ప్రజా ఉద్యమం రోజురోజుకీ బలపడుతున్నది. అన్నా మద్దతుదారులు అన్ని ప్రధాన నగరాలలోనూ రోడ్లపైకి వచ్చి ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అన్నా స్వగ్రామంలో అయితే గ్రామస్థులు గుండు కొట్టించుకుని అన్నాకు సంఘీభావం ప్రకటించారు.












Click it and Unblock the Notifications