హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వర్గ ఎమ్మెల్యేల రాజీనామాల ఆమోదానికి మొగ్గు

By Pratap
|
Google Oneindia TeluguNews

Nadendla Manohar
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గం శాసనసభ్యుల రాజీనామాల ఆమోదానికే శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ మొగ్గు చూపే అవకాశాలున్నాయి. రాజీనామాలు చేసిన 26 మంది రాజీనామాలను ఆమోదించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు సూచించినట్లు తెలుస్తోంది. వారు సమర్పించిన రాజీనామాల లేఖలు సరైన పద్ధతిలో ఉంటే ఆమోదించడమే మంచిదని వారు భావించినట్లు సమాచారం.

రాజీనామాలు ఆమోదించడం వల్ల జగన్ వర్గం శానససభ్యుల తలనొప్పి శాశ్వతంగా తొలగిపోతుందని, దానివల్ల మేలు జరుగుతుందని కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ భావించినట్లు చెబుతున్నారు. తెనాలి పర్యటనలో ఉన్న స్పీకర్ హైదరాబాదుకు వచ్చిన వెంటనే లేఖలను విప్పి, తనను కలవాలని ఒక్కరొక్కరని ఆహ్వానించి, వారు ఇచ్చే వివరణ సరైందని తోస్తే రాజీనామాలను ఆమోదిస్తారని అంటున్నారు. జగన్ వర్గానికి చెందిన ఐదుగురు శాసనసభ్యులు ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నట్లు, వారి డిమాండ్లను ముఖ్యమంత్రి ముందు పెడుతున్నట్లు, అయితే ముఖ్యమంత్రి వారి షరతులను అంగీకరించడానికి నిరాకరిస్తున్నట్లు వార్తలు వస్తున్ాయి.

మరింత మంది శానససభ్యులు జగన్ వైపు వెళ్లకుండా చూసే బాధ్యతను మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి, గల్లా అరుణకుమారి, రాంరెడ్డి వెంకటరెడ్డి నిర్వహిస్తున్నారు. వైయస్ జగన్ పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చడం ముఖ్యమంత్రికి ఇతోధికంగా మేలు చేస్తున్నట్లు చెబుతున్నారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలతో మాట్లాడేది లేదని, స్పీకర్ వారి రాజీనామాలను ఆమోదిస్తే తాము వచ్చే ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని బొత్స సత్యనారాయణ ఓ ఆంగ్లదిన పత్రికతో అన్నారు.

English summary
Taking the YS Jaganmohan Reddy loyalist Congress MLAs head on, chief minister N Kiran Kumar Reddy and Andhra Pradesh Congress Committee president Botsa Satyanarayana want Speaker Nadendla Manohar to accept the resignations submitted by the 29 legislators provided they are in order.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X