19ఏళ్ల అమ్మాయిపై గ్యాంగ్ రేప్: పదేళ్ల కారాగారం

ఈ ఘటన రెండేళ్ల క్రితం జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అక్టోబర్ 25, 2009లో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అక్టోబర్ 24, 2009 రాత్రి తొమ్మిది గంటల సమయంలో తాను పని చేసే చోటు నుండి కల్యాణ్ పురిలోని తన ఇంటికి వెళుతున్న సమయంలో ఆమెకు తెలిసిన ముగ్గురు ఎదురయ్యారు. ఆమెను బెదిరించి ఓ చోటుకు తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. విచారణ సమయంలో తమపై అభియోగాలు సరియైనవి కావని నిందితులు చెప్పారు. అయితే జడ్జి వారి మాటలను పరిగణలోకి తీసుకోలేదు. ఏ భారత స్త్రీ ఇలాంటి ఆరోపణలు వట్టినే చేయదన్నారు.












Click it and Unblock the Notifications