సిబిఐ ఎదుట హాజరైన కోనేరు ప్రసాద్ తనయుడు

కాగా, గాలి జనార్దన్ రెడ్డి గనుల అక్రమ తవ్వకం కేసులో కూడా సిబిఐ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు (పిఎ) అలీఖాన్ కోసం సిబిఐ అధికారులు అన్వేషణ ప్రారంభించారు. అతని కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి అంతర్జాతీయ విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన అస్తులు, సొమ్ము వివరాలు అలీఖాన్ వద్ద ఉన్నట్లు సిబిఐ అధికారులు అనుమానిస్తున్నారు. అలీఖాన్ ల్యాప్‌టాప్‌లో వివరాలన్నీ ఉంటాయని వారు భావిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications