ఇప్పటి వరకు చేసింది చాలు: టి-ఎంపీలకు ప్రణబ్ క్లాస్

అందుకు వారు తమ పరిస్థితి అర్థం చేసుకోవాలని, తెలంగాణపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. రోడ్ మ్యాప్ ప్రకటించేంత వరకు తాము నిరసన ఆపేది లేదని ప్రణబ్‌కు చెప్పారు. అయితే అందుకు ప్రణబ్ మరింత తీవ్రంగా వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రణబ్ క్లాస్ పీకడంతో టి-ఎంపీలు ఎవరితో మాట్లాడకుండా అక్కడి నుండి నిష్క్రమించారు. కాగా ధరలు, విభజనతో లోకసభ దద్దరిల్లడంతో స్పీకర్ మీరా కుమార్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు కెసిఆర్, విజయశాంతిలు తెలంగాణ బిల్లు సభలో పెట్టాలంటూ స్పీకర్ పోడియం ముందు బైఠాయించారు.












Click it and Unblock the Notifications