బొత్సకు వాయిస్ లేకుండా చేశారు: సిఎంపై కాపునాడు

కాగా పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే విధంగా విభేదాలు ఉన్నాయనే వాదనలు ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన బొత్సను లక్ష్యంగా చేసుకొని ఇటీవల ముఖ్యమంత్రి మద్యం సిండికేట్లపై దాడులు నిర్వహించారన్న ప్రచారం జరిగింది. మంత్రివర్గంలో తనకు కేటాయించిన శాఖపై అసంతృప్తి మొదలు నేటి వరకు బొత్స సిఎంపై అసంతృప్తితోనే ఉన్నారనే చెప్పవచ్చు. అలాగే తాను సూచించిన వారికి కాకుండా తనపై అసంతృప్తిగా ఉన్న బొత్సకు పిసిసి చీఫ్ వచ్చినప్పటి నుండి కిరణ్ కూడా ఆయనపై గుర్రుగానే ఉన్నారు. అధిష్టానం వద్ద ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకునే వరకు కూడా వెళ్లినట్లు వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications