హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిరూపిస్తే ఉరేసుకుంటా: ఆరోపణలపై ఎపిఐఐసి మాజీ చైర్మన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Shivarama Subbrahmanyam
హైదరాబాద్: తాను దుబాయ్‌లో విల్లాలు కావాలని కోరినట్లు నిరూపిస్తే కాంగ్రెసు పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో ఉరేసుకుంటానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఎపిఐఐసి) మాజీ చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం సవాల్ చేశారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసును పక్కదారి పట్టించేందుకే తనపై అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. విల్లాలు కొనుగోలు చేసినవారిని విచారిస్తే ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంలో ఎవరి పాత్ర ఉందనేది బయటపడుతుందని ఆయన అన్నారు. తాను గానీ, ఎపిఐఐసి మాజీ మైనేజింగ్ డైరెక్టర్ గానీ దుబాయ్‌లో విల్లాలు కావాలని కోరామని చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఆయన అన్నారు.

తాము దుబాయ్‌లో విల్లాలు కావాలని కోరినట్లు ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు చెందిన విజయరాఘవన్ తదితరులు చెప్పినట్లు అఫిడవిట్ దాఖలైందని వార్తలు వచ్చాయని, ఆ వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. తమపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపసంహరించుకోకపోతే వాటిని రుజువు చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు.

English summary
APIIC former chairman Shivarama Subrahmanyam refuted charges against him regarding Dubai villas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X