వైయస్ ఇబ్బంది పెట్టారు, మర్చిపోలేను: డిఎస్

ఉప ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయని, ఫలితాలు ఏకపక్షంగా ఉండవని పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ తీవ్రత గతంలో పోల్చుకుంటే ఎక్కువగా లేదని, ఉప ఎన్నికల్లో బాన్సువాడ కన్నా మంచి ఫలితాలు కాంగ్రెసుకు వస్తాయని ఆయన అన్నారు.ఇటీవల మేడమ్ సోనియాను కలిసిన సందర్భంలో తాను ఎవరిపై ఫిర్యాదు చేయలేదని, మర్యాద పూర్వకంగానే ఆమెను కలిసినట్లు ఆయన వివరించారు. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో తాను మంత్రి పదవి ఆశించడం లేదని, ఎమ్మెల్సీ పదవి మేడమ్ దయవల్లే వచ్చిందని డీఎస్ స్పష్టం చేశారు.
కామారెడ్డి ఉప ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన షబ్బీర్ అలీయే సరైన వ్యక్తని, గతంతో పోల్చుకుంటే నియోజక వర్గంలో పరిస్థితి పూర్తిగా మారిందని డీఎస్ విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సీనియర్లు పోటీకి వెనుకాడడం సరికాదని, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఆయనకే సానుకూలంగా ఉందని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉప ఎన్నికలు ప్రభుత్వానికి రెఫరెండమ్ కాదని అన్నారు.












Click it and Unblock the Notifications