మోపిదేవికి సిఎం క్లీన్‌చిట్, బాబుపై కేసు నమోదైంది!

Mopidevi Venkataramana
హైదరాబాద్: శాసనసభలో ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం క్లీన్ ఇచ్చారు. మోపిదేవికి క్లీన్ చిట్ ఇవ్వడంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రికి క్లీన్ చిట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అంతకుముందు మోపిదేవి మాట్లాడుతూ.. నున్నా రమణ ఇచ్చిన రూ.పది లక్షల రూపాయలు నాకు ఇవ్వలేదని నా స్నేహితుడు, బాబ్జీ బహిరంగంగా ప్రకటించారని అన్నారు. క్రిమినల్ రమణ ఆరోపణల ఆధారంగా నాపై విమర్శలు సరికావన్నారు. సిండికేట్లతో తనకు సంబంధం లేదన్నారు. రమణ ఆరోపణలు నిరాధారమైనవన్నారు. నాపై ఆరోపణలు రాగానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి వివరణ ఇచ్చానని చెప్పారు. తన తనయుడికి ఎలాంటి విధమైన వ్యాపారాలు లేవన్నారు. మొదట కంపెనీ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ సంబంధిత మంత్రిగా మద్యం వ్యాపారం వద్దని ఊరుకున్నానని అన్నారు. ఎన్నారైతో కలిసి వ్యాపారం చేయాలని నా కుమారుడు మొదట భావించారని ఆ తర్వాత ఆ ప్రతిపాదనను విరమించుకున్నామని, నా కుమారుడి ఫర్మ్ రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేయించానని చెప్పారు.

టిడిపి గాలి కబుర్లు పోగేసి ఆరోపణలు చేస్తుందన్నారు. బ్లాక్ ఈగిల్‌తో ఒప్పందం రద్దు చేసుకున్నామని చెప్పారు. నకిలీ మద్యాన్ని నిరోధించేందుకు హోలోగ్రాంలు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలకు తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. విచారణలో తాను తప్పు చేసినట్టు తేలితే తక్షణమే రాజీనామా చేస్తానని అన్నారు. మద్యం సిండికేట్ల విషయంలో ఎసిబికి పూర్తి స్వేచ్ఛనిచ్చామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. సిండికేట్లపై మీడియాలో విభిన్న కథనాలు వస్తున్నాయన్నారు. సిండికేట్లపై తాను గానీ, తన మంత్రివర్గం గానీ ఎక్కడా జోక్యం చేసుకోలేదని అన్నారు. తాము భవిష్యత్తులో కూడా ఎసిబి విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోబోమన్నారు. దోషులు తప్పకుండా బయటకు రావాలన్నారు. విచారణ చేస్తోంది కూడా నిజాయతీపరులైన అధికారులేనన్నారు. ఎసిబి పక్షపాతం లేకుండా విచారణ చేస్తోందన్నారు. మేము జోక్యం చేసుకుంటే ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి పేరు ఎలా వస్తుందన్నారు. ఏ పార్టీ వారు, ఏ స్థాయిలో ఉన్న వారైన తప్పు చేసినట్టు రుజవైతే చర్యలకు వెనుకాడేది లేదన్నారు.

టిడిపి నేతలు మాట్లాడేటప్పుడు అదుపులో మాట్లాడాలన్నారు. ఏడో పేజీ మిస్ అయిందని టిడిపి అంటోందని అది కోర్టు ధిక్కారం కిందకి వస్తుందని, అలా బయట అంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు. మద్యం సిండికేట్లలో మోపిదేవి పాత్ర లేదని సిఎం ఖరాఖండిగా చెప్పారు. మోపిదేవి నిందితుడు కానే కాదన్నారు. క్రిమినల్ వాంగ్మూలం కోర్టులో చెల్లదన్నారు. మంత్రి ధర్మాన ప్రసాద రావు, ఆయన తనయుడుకు మద్యం సిండికేట్లతో ఎలాంటి సంబంధం లేదన్నారు. లిక్కర్ కేసులో బాబు నిందితుడు అని, ఆయన కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని అన్నారు. చంద్రబాబుపై కేసు కూడా నమోదైందని అప్పుడు ఆయన రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. గతంలో గాలి ముద్దు కృష్ణమ నాయుడే బాబుపై ఆరోపణలు చేశారన్నారు. మోపిదేవి రాజీనామా కోరే స్థాయి టిడిపికి లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+