సభ వాయిదా, ఎమ్మెల్యేగా జగన్ వర్గం నేత ప్రమాణం

కాగా సభ వాయిదా పడిన అనంతరం టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. తెలంగాణలో సభలో వెంటనే చర్చ పెట్టి తీర్మానం చేయాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు. కేంద్రం తెలంగాణ ఇస్తుందో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం నాన్చుడు ధోరణి కారణంగానే విద్యార్థులు బలవుతున్నారని ఆరోపించారు.
ఇటీవల కొవూరు నుండి గెలిచిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెస్ డబ్బు, మద్యం పారించాయని విమర్శించారు. రానున్న ఉప ఎన్నికల్లో 18 స్థానాల్లో జగన్ పార్టీయే గెలుస్తుందన్నారు. ఎన్టీఆర్, వైయస్ రాజశేఖర రెడ్డి తర్వాత అత్యంత ప్రజాధరణ కలిగిన నేత జగన్ అన్నారు. ఆయన ఓ శక్తి అన్నారు. కాగా నల్లపురెడ్డితో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం అసెంబ్లీలో రెండుకు పెరిగింది. ఇప్పటికే పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ ఎమ్మెల్యేగా ఉన్నారు.