ఢిల్లీమున్సిపాలిటీ ఎందుకు ప్రతిష్టాత్మకం?, బిజెపి హవా

గతంలో ఎంసిడి(మున్సిపల్ కార్పోరేషన్ ఆఫ్ ఢిల్లీ) బిజెపి వశమైంది. కాగా మధ్యాహ్నం రెండున్నర గంటలకు అందిన సమాచారం మేరకు... మొత్తం 272 స్థానాలలో బిజెపి 140, కాంగ్రెసు 77 స్థానాలలో బిఎస్పీ 15 ఇతరులు 40 స్థానాలలో ఆధిక్యంలో లేదా గెలుపొందారు. ఉత్తర ఢిల్లీలో బిజెపి 60, కాంగ్రెసు 29, దక్షిణ ఢిల్లీలో బిజెపి 40, కాంగ్రెసు 30, తూర్పు ఢిల్లీలో బిజెపి 33, కాంగ్రెసు 18 స్థానాలలో గెలుపు లేదా ముందంజలో ఉంది. ఫలితాల సరళి చూస్తే బిజెపియే మూడు మేయర్ స్థానాలను కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కాగా ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెసు, బిజెపి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి పలు కారణాలు ఉన్నాయి. ఢిల్లీ దేశ రాజధాని. ఇక్కడ రాష్ట్ర పాలనకు దాదాపు సమాంతరంగా ఢిల్లీ మున్సిపల్ పాలన కొనసాగుతుంది. ప్రస్తుతం ఢిల్లీలో షీలా దీక్షిత్ ఆధ్వర్యంలోని కాంగ్రెసు ప్రభుత్వం ఉంది. నిన్నటి వరకు ఢిల్లీ మేయర్ స్థానం బిజెపిది.
అయితే మేయర్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెసు ఢిల్లీ మున్సిపాలిటీని ముక్కలు చేసింది. నిన్నటి వరకు ఒక్క మేయర్ ఉండగా ఇప్పుడు ముగ్గురు మేయర్లు ఉంటారు. ఉత్తర, దక్షిణ, తూర్పు ఢిల్లీలుగా కేంద్రం దానిని విభజించింది. దీంతో కనీసం ఒక్క స్థానంలోనైనా కాంగ్రెసు మేయర్‌ను గెలిపించుకోవచ్చునని భావించింది. అయితే ప్రస్తుత ఫలితాల సరళి చూస్తుంటే మాత్రం కాంగ్రెసు ఢిల్లీ ముక్కల వ్యూహం ఫలించేట్లుగా కనిపించడం లేదు.
-
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా












Click it and Unblock the Notifications