తెహ్రీర్ స్క్వేర్ వద్ద మళ్లీ నిరసన వెల్లువ

నెలల తరబడిగా వివాదాలతో, పరస్పర ఆరోపణలతో కాలం గడిపినప్పటికీ నిరసన ప్రదరశనలో ప్రతిపక్ష ఇస్లామిక్ పార్టీలు, ఉదార యువజన గ్రూపులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాయి. సైనిక పాలన అంతం కావాలని నిరసనకారులు నినాదాలు చేశారు. నిరుటి ఎన్నికల్లో ఇస్లామిస్టులు 70 శాతం పార్లమెంటు సీట్లు సాధించారు.
వారంతా వీధి పోరాటాలకు దూరంగా ఉన్నారు. నిరుటి ప్రజాప్రభంజనంలో హోస్నీ ముబారక్ అధికారం కోల్పోయిన తర్వాత ప్రభుత్వాన్ని చేపట్టిన జనరల్స్ తమను కలుపుకుంటారనే ఉద్దేశంతో వారు వీధి పోరాటాలకు దూరంగా ఉన్నారు. సైన్యం నియమించిన క్యాబినెట్‌ను రద్దు చేసి, పార్లమెంటును కొత్తగా రూపుదిద్దాలని ఇస్లామిస్టులు డిమాండ్ చేశారు. కానీ మిలిటరీ నిరాకరించింది.
హోస్నీ ముబారక్‌ను గద్దె దింపడానికి తెహ్రీర్ స్క్వేర్ నిరసన ప్రదర్శనలతో అట్టుడికిన విషయం తెలిసిందే. హోస్నీ ముబారక్‌ను గద్దె దించిన తర్వాత సైన్యం అధికారాన్ని చేపట్టింది. పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఇప్పుడు నిరసన వెల్లువ పెల్లుబుకుతోంది.












Click it and Unblock the Notifications