గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీలో చేరితే జైలుకే వెళ్తారు: చంద్రబాబు వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
గుంటూరు: వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరితే జైలుకే వెళ్తారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన బుధవారం గుంటూరు జిల్లా పత్తిపాడు శాసనసభా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. వైయస్ జగన్‌పై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. తన ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులు పైస్థాయిలకు చేరుకున్నారని, వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో పనిచేసిన ఐఎఎస్ అధికారులు చంచల్‌గుడా జైలుకు వెళ్లారని, విశ్వసనీయత అంటే అదని ఆయన అన్నారు.

వైయస్ జగన్ వెంట నడిస్తే హైదరాబాదులోని చంచల్‌గుడా జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరూ కాపాడే పరిస్థితి ఉండదని ఆయన అన్నారు. రాష్టంలో సమస్యలు చాలా ఉన్నాయని, అన్ని రంగాలవారు సమస్యలు ఎదుర్కుంటున్నారని, రైతులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆయన అన్నారు. రైతులను చూస్తే గుండె తరుక్కుపోతుందని, తన చివరి రక్తం బొట్టు వరకు రైతుల కోసం పనిచేస్తానని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీ విజయం చారిత్రక అవసరమని, తనకు కుటుంబ సభ్యులకన్నా పార్టీ శ్రేణులే ముఖ్యమని ఆయన అన్నారు. రాష్టం సమస్యల సుడిగుండంలో ఉందని, కాంగ్రెసుకు ఓటేస్తే ముందు ముందు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన అన్నారు. మద్యం మాఫియా, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియాలను కాంగ్రెసు పెంచి పోషించిందని ఆయన అన్నారు. రౌడీలను, గుండాలను పెంచి పోషించడం తప్ప కాంగ్రెసు సాధించిన విజయాలు ఏమీ లేవని ఆయన అన్నారు.

పరిటాల రవి హత్య కేసులో నిందితులను ఒక్కరొక్కరినే చంపుకుంటూ పోయారని ఆయన ఆరోపించారు. సాక్ష్యాలు బయటకు వస్తాయనే అలా చేసుకుంటూ వెళ్లారని ఆయన అన్నారు. సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ 800 కోట్ల రూపాయల సంపాదించాడని ఆయన అన్నారు. భాను కిరణ్‌కు పులివెందుల కృష్ణకు సంబంధాలున్నాయని, పులివెందుల కృష్ణతో జగన్‌కు సంబంధాలున్నాయని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో తమ పార్టీ కార్యకర్తలను హత్య చేశారని ఆయన అన్నారు.

English summary
Telugudesam president N Chandrababu Naidu lashed out at YSR Congress president YS Jagan. He warned the leaders and workers who want to join YSR Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X