వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాక్షి పత్రిక కాదు, వైయస్సార్ కరపత్రం: మందకృష్ణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Manda Krishna Madiga
కరీంనగర్: వైయస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినీతి అక్రమాలతో నెలకొల్పిన పత్రిక సాక్షి అని, అది ఒక పత్రిక కాదని, అది వైయస్సార్ కరపత్రమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తిలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.

తండ్రి పదవులను అడ్డుపెట్టుకుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అక్రమంగా సంపాదించిన ఆస్తులను పూర్తిగా జప్తు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2004 ఎన్నికల నాటికి తనకు అప్పులు ఉన్నట్లు ఎన్నికల కమిషన్‌కు చూపించారని అంటూ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన ఆరేళ్లలో లక్షల కోట్ల రూపాయలను ఎలా సంపాదించాడని ఆయన అడిగారు.

అవినీతి సొమ్ముతో పత్రికను ఏర్పాటు చేసి, దాన్ని వైయస్సార్ తన కరపత్రంగా మార్చుకున్నాడని దుయ్యబట్టారు. అవినీతి సొమ్ముతో నిర్మించిన పత్రిక ఖాతాలను సీబీఐ అధికారులు ఫ్రీజ్ చేస్తే కొంత మంది పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని అనడం సిగ్గు చేటని ఆయన అన్నారు. ఓ దినపత్రిక ఎడిటర్ నూకారపు సూర్యప్రకాశ్‌రావును జైలులో పెడితే ఏ ఒక్క యూనియన్ నాయకుడు పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడలేదని గుర్తు చేశారు. జగన్ పత్రికకు ఒక న్యాయం వేరే పత్రికలకు ఇంకో విధమైన న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు.

వైయస్ జగన్ పత్రికతో లబ్ధిపొందిన యూనియన్ నాయకులకు మాత్రమే పత్రికా స్వేచ్ఛకు భంగం కల్గినట్లు కనబడుతుందని ఆయన అన్నారు. అవినీతి, అక్రమ సంపాదనలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు దారి చూపిస్తే రాజశేఖర్‌రెడ్డి వాటికి హద్దు లేకుండా చేశాడన్నారు. చంద్రబాబు, వైఎస్సార్ అక్రమ సంపాదనతో రాష్ట్రంలో పూర్తిగా పేదరికాన్ని నిర్మూలించవచ్చని మంద కృష్ణ చెప్పారు.

English summary

 MRPS founder president Manda Krishna Madiga has term Sakshi daily as pomphlet of YS Rajasekhar Reddy. He demanded seize YSR Congress president YS Jagan properties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X