కంటెయినర్ ఢీ: పల్టీ కొట్టి నుజ్జునుజ్జయిన ఆర్టీసి బస్సు

కంటెయినర్ ఢీకొన్న సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్‌తో పాటు నలుగురు ప్రయాణీకులు మాత్రమే ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు. అదివారం కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందంటున్నారు. రోజూ ఈ బస్సులో చాలామంది సాఫ్టువేర్ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు ప్రయాణిస్తుంటారు. దీంతో బస్సు పూర్తిగా నిండిపోతుంది.
అయితే ఈరోజు ఆదివారం కావడంతో సాఫ్టవేర్ ఉద్యోగులకు సెలవుదినం. ఆ రోడ్డులో కూడా రోజు చాలామంది ప్రయాణిస్తుంటారు. ఈరోజు రోడ్డు పైన ఎక్కువమంది లేరు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందంటున్నారు. మరోవైపు కర్మన్‌ఘాట్‌లో శ్రీకాంత్ అనే పన్నెండేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన దుండగులను స్థానికులు పట్టుకొని చితకబాదారు. ఇంటిముందు ఆడుకుంటున్న శ్రీకాంత్ అనే బాలుడిని ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు మభ్యపెట్టి ఓ గదిలో బంధించారు.
వారి కదలికలపై అనుమానం వచ్చిన స్థానికులు వారిని ప్రశ్నించారు. దీంతో వారి కిడ్నాప్ వ్యవహారం బయటపడింది. స్థానికులకు విషయం తెలిసిపోవడంతో వారిలో ఒకరు పారిపోయాడు. మిగిలిన ఇద్దరిని చావబాదిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. మూడో వ్యక్తి కోసం పట్టుబడ్డ ఇద్దరి నుండి సమాచారం కూపీ లాగుతున్నారు.
కాగా నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం ధర్మోరలో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను చెరువులో పడవేశాడు. కుటుంబ కలహాల కారణంగానే తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది.
-
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
తమిళనాడులో రిచ్ అభ్యర్థి ఈమెనే! ఎవరీ లీమా రోజ్ మార్టిన్? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
Assembly Poll Survey: బెంగాల్, అస్సాంలో గెలుపెవరిది ? షైనింగ్ ఇండియా తాజా సర్వే..! -
ఇరాన్ డెడ్ లైన్ పై ట్రంప్ మళ్లీ వెనక్కి ? అదే టర్నింగ్ పాయింట్..! -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
వేసవి సెలవులలో పిల్లలు ఆ పనిచేసే అవకాశం.. తల్లిదండ్రులు అలెర్ట్! -
Tamil Nadu Poll Survey: తమిళనాడులో షాకింగ్ ఫలితాలు-లోక్ పోల్ తుది సర్వేలో వారే క్లీన్ స్వీప్..! -
చందమామకు అవతలి వైపు అద్భుతం- సంపూర్ణ సూర్యగ్రహణం












Click it and Unblock the Notifications