కొత్త వివాదంలో నిత్యానంద స్వామి: రంజిత పైనా కేసు

నిత్యానంద పులి చర్మం ఉపయోగిస్తున్నట్లు హిందూ మక్కల్ కచ్చి సభ్యుడు సోలై కణ్ణల్ ఫిర్యాదుతో బయటకు వచ్చింది. పోలీసులు నిత్యానందతో పాటు రాసలీలల కేసులో ఇరుక్కున్న నటి రంజిత పైన, పిఆర్‌ఓ పైన కూడా కేసు నమోదు చేశారు. నిత్యానంద తనకు డ్రింక్ ఇచ్చి ఇంగ్లీష్ పాటకు డాన్స్ చేయమన్నారని ఫిర్యాదుదారుడు ఆరోపించారు. దీనిపై ఆధారాలు లేనందున కేసు నమోదు చేసుకోవడానికి పోలీసులు నిరాకరించినట్లుగా తెలుస్తోంది. కాగా ఇప్పటికే నిత్యానందను పలు వివాదాలు చుట్టు ముట్టిన విషయం తెలిసిందే.
తమిళనాడులోని మదురై ఆధీనంలోని మతపరమైన కేంద్రంలోని పవిత్ర జలాల్లో నిత్యానంద డ్రగ్స్ కలిపేవాడని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై హిందూ మక్కల్ కచ్చికి చెందిన ఎం సోలైకణ్ణన్ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. భక్తులకు నిత్యానంద ఇస్తున్న పవిత్ర జలాలను పరీక్షలకు పంపించాలని ఆయన పోలీసులను కోరారు. అయితే, సోలైకణ్నన్ ఫిర్యాదును పోలీసులు స్వీకరించడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో నిత్యానందపై, మరో ఇద్దరిపై సోలైకణ్నన్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై శుక్రవారం కోర్టులో విచారణ ప్రారంభమైంది.
నిత్యానందపై, ఆయన ఇద్దరు శిష్యులపై పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పారు. నిత్యానంద ఇటీవల కర్ణాటకలోని బెంగళూర్ నుంచి తమిళనాడులోని మదురైకి మారాడు. ఆయనను ఎప్పటికప్పుడు వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఓ నటితో రాసలీలలు నడిపినట్లు ఆరోపిస్తూ బయటకు వచ్చిన వీడియోల కేసులో ఆయన 2010లో మొదటి సారి అరెస్టయ్యాడు.
ఆ కేసులో ఆయన బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆ తర్వాత 2012లో జైలు ఊచలు లెక్కించాల్సి వచ్చింది. మీడియా ప్రతినిధులపై దాడి చేశారనే అభియోగాలను ఆయన ఎదుర్కున్నారు. రేప్, లైంగిక వేధింపులు వంటి ఆరోపణలు కూడా అతన్ని చుట్టుముట్టాయి. విదేశీ వనితను లైంగిక వేధించిన కేసులో నిత్యానందను అరెస్టు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి సదానంద గౌడ ఆదేశాలు జారీ చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications