అమెరికాలో బెంగళూర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

Pawan
బెంగళూర్: కర్ణాటక రాజధాని బెంగళూర్‌కు చెందిన 26 ఏళ్ల టెక్కీ ఒకతను అమెరికాలో మరణించాడు. కంపెనీ అసైన్‌మెంట్‌పై అమెరికా వెళ్లిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ న్యూజెర్సీలోని హోటల్ గదిలో గత వారం ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. ఓ అమెరికా మహిళ హత్య కేసులో అతను నిందితుడు కూడా.

కాగ్నిజెంట్‌లో పనిచేస్తున్న పవన్ కుమార్ అంజయ్య అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అమెరికాలోని హోటల్ గదిలో మత్తుపదార్థాలను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల మరణించినట్లు అనుమానిస్తున్నారు. డేలవారే స్టేట్ పోలీసులు చెప్పినట్లు ఈ మేరకు అమెరికా మీడియా వార్తకథానాలను ఇచ్చింది. న్యూజెర్సీలోని వేయినే కౌంటీలో గల బెల్లెవెల్లే నగరంలోని గదిలో అతను జూన్ 19వ తేదీన మరణించాడు.

వారం రోజులు గడిచినా మృతదేహం నగరానికి రాకపోవడంతో పవన్ కుమార్ అంజయ్య కుటుంబ సభ్యులు సంస్థపై ఆరోపణలు చేస్తున్నారు. మీడియాతో మాట్లాడవద్దంటూ సంస్థ యజమానులు చేతులు దులుపుకుంటున్నారని వారు అంటున్నట్లు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక రాసింది. పవన్ కుమార్ అంజయ్య ఏ విధమైన నేరానికి పాల్పడలేదని వారు అంటున్నారు.

డానిల్లే మెహమాన్ అనే 26 ఏళ్ల టీచర్, నాలుగేళ్ల బాలుడి తల్లి హత్య కేసులో పోలీసులు పవన్ కోసం ఇప్పటి వరకు గాలిస్తున్నారు. ఆమె శవం డేలావారేలోని దేవెయ్ బీచ్ హోటల్ గదిలో ఆమె శవం జూన్ 18వ తేదీన కనిపించింది. ఆమె శరీరంపై పలు గాయాలున్నాయి. ఆమెతో పవన్ హోటల్ గదిని పంచుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ నిజానికి వచ్చే వారం బెంగళూర్ తిరిగి రావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+