ఫుల్ టైమ్ పాలిటిక్స్: రాహుల్ వెనుక ప్రియాంక గాంధీ

తన తల్లి సోనియాగాంధీ తరఫున రాయబరేలీ నియోజకవర్గ బాధ్యతలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. సోనియా అందుబాటులో లేని సమయంలో... ప్రియాంక ఆ నియోజకవర్గ ప్రజల కష్టాలు తీర్చేందుకు ఢిల్లీలో దర్బార్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ నియోజకవర్గం వారితో ప్రతి బుధవారం ఢిల్లీలో ప్రియాంక సమావేశం ఏర్పాటు చేయనున్నారట. అందిన సమాచారం మేరకు ఆమె నియోజకవర్గ సమస్యలపై నిత్యం వారితో చర్చించనున్నారట.
ఇప్పటిదాకా... రాయబరేలీ, అమేథీల్లో ఎన్నికల ప్రచారానికి మాత్రమే పరిమితమైన ప్రియాంక ఇప్పుడు... రాజకీయ పాత్ర కూడా పోషించేందుకు సిద్ధమవుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆమె రాకతో యూపీలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికలను బలంగా ఎదుర్కోవాలన్నా ప్రియాంకలాంటి 'కొత్త శక్తి' అవసరమని పేర్కొంటున్నాయి.
యూపీ ఎన్నికల్లో రాహుల్ విపరీతంగా శ్రమించినా..పెద్దగా ఫలితం లభించని విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. "రాహుల్ మరింత పెద్ద పాత్ర పోషించాలని పార్టీలో అన్ని స్థాయిల వారు కోరుకుంటున్నారు. మరింత క్రియాశీలకంగా మారేందుకు ఇటీవల రాహుల్ అంగీకరించినప్పటికీ... ఎప్పుడు అనే విషయాన్ని తిరిగి సోనియాకే వదిలేశారు'' అని పార్టీ వర్గాలు అంటున్నాయి.












Click it and Unblock the Notifications