టెకాఫ్ అవుతున్న విమానం నుంచి దూకేశాడు, అరెస్ట్

అయితే, రన్‌వేపై నెలకొన్న ఇబ్బందులతో ఓ గంట ఆలస్యంగా అది టేకాఫ్‌కు సిద్ధమైంది. విమానం మెల్లగా కదిలింది. కొంచెం వేగం అందుకుంది. అంతలోనే హఠాత్తుగా దాని అత్యవసరం ద్వారం తెరచుకుంది. అందులోంచి ఓ పాతికేళ్ల వ్యక్తి కిందకు దూకేశాడు. లోపలున్న ప్రయాణీకులు అరవడంతో పైలట్ విమానాన్ని ఆపేశాడు. దీంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇంతలో అక్కడికి చేరుకున్న భద్రతా బలగాలు కిందకు దూకి పరుగెడుతున్న వ్యక్తిని ఆస్పత్రికి తరలించాయి. అతడికి ఎలాంటి గాయాలూ తగల్లేదని తేలడంతో వెంటనే అరెస్టు చేశారు. విమానం కదిలిన వెంటనే అత్యవసర ద్వారం తెరుచుకుని దూకిన ఒక వ్యక్తి రన్‌వేపై పరుగందుకున్నాడని ఎయిర్ ఆసియా అధికారి ఒకరు తెలిపారు.
ప్రత్యక్ష సాక్షి ఒకరు మాట్లాడుతూ.. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఆ వ్యక్తి ఒక్కసారిగా అత్యవసర ద్వారాన్ని తెరిచి కిందకు దూకాడని దీంతో ప్రయాణీకులు ఆర్తనాదాలు చేశారని, దీంతో పైలట్ ప్లేన్ ఆపేశారని చెప్పారు.












Click it and Unblock the Notifications