వైయస్ జగన్‌కు జైలు జీవితం అదృష్టం: ఉప్పునూతల

జగన్ అరెస్టు కావడం కూడా ఒక అదృష్టమేనని, జైలులో లభించే ఖాళీ సమయంలో వివిధ అంశాలపై ఆలోచించి సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. జైలులో వివిధ మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు కలుస్తుంటారని, దానివల్ల మానసిక పరిపక్వత ఒనగూరుతుందని ఆయన అన్నారు.
బతికుకున్నప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డిని దేవుడిగా పొగడిన ఇప్పటి మంత్రులు మరణించిన తర్వాత దయ్యమని నిందించడం సరి కాదని ఆయన అన్నారు. త్వరలో కాంగ్రెసు మొత్తం ఖాళీ అవుతుందని, కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగనేనని ఆయన అన్నారు.
కాంగ్రెసు సీనియర్ నేత అయిన ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నెల 9వ తేదీన ఆయన అధికారికంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారు. నల్లగొండ జిల్లాలో మంచి పట్టు ఉన్న ఆయన వైయస్సార్ కాంగ్రెసుకు జిల్లాలో అత్యంత ముఖ్యమైన నాయకుడే అవుతారు.












Click it and Unblock the Notifications