వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెట్రో ధరలు పెంచం కానీ, కఠిన నిర్ణయాలే: జైపాల్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jaipal Reddy
న్యూఢిల్లీ: పెట్రోలు ధరలను తక్షణం పెంచే యోచన ఏమాత్రం లేదని పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్ రెడ్డి శుక్రవారం స్పష్టం చేశారు. పెట్రో ధరల పెంపుదల పైన రాజకీయ ఏకాభిప్రాయం లేదన్నారు. ధరల పెంపుపై నిర్ణయాన్ని మంత్రివర్గ ప్యానెల్ తీసుకుంటుందని జైపాల్ చెప్పారు. పెట్రోలు ధరలు ఇప్పటికిప్పుడు పెంచే యోచన లేకపోయినప్పటికీ కొన్ని కఠిన నిర్ణయాలు మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకోక తప్పదన్నారు.

కాగా రెండు రోజుల క్రితం పెట్రో ధరలను పెంచాలని పెట్రోలియం శాఖ... మంత్రివర్గానికి నోట్ పంపింది. పెట్రో ఉత్పత్తులపైన ఆయిల్ కంపెనీలకు రోజుకు రూ.550 కోట్ల నష్టం వస్తోందని ఈ నోట్‌లో పేర్కొన్నారు. ఇందువల్ల పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత పెట్రోలు, డీజిల్ ధరలు రూ.5 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి.

ఈ వార్తలు జోరుగా రావడం, కేంద్రంపై పలువురు మండిపడుతున్న నేపథ్యంలో జైపాల్ రెడ్డి ఈ రోజు దానిపై వివరణ ఇచ్చారు. ధరల పెంపుదల వార్తలను కొట్టి పారేశారు. కాగా జైపాల్ రెడ్డి ధరలు పెంచే యోచన లేదని చెప్పడంతో ఆ ఎఫెక్ట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై పడుతోంది. ఐవోసీ, హెచ్‌పిసిఎల్, భారత్ పెట్రోలియం షేర్ల ధరలు పడిపోతున్నాయి.

English summary

 Petroleum Minister S Jaipal Reddy today said that there is no immediate plan to raise fuel prices.
 Although, he also added, "We have to take some difficult, painful decisions."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X