హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వస్తున్నా మీకోసం: బాబు యాత్ర రూట్ మ్యాప్ ఖరారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: అక్టోబర్ 2వ తారీఖు నుండి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టబోయే పాదయాత్ర కోసం రూట్ మ్యాప్ ఖరారైంది. అనంతపురం జిల్లా హిందూపురం నుండి బాబు తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. స్థానికంగా ఉన్న ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయంలో తొలుత ప్రత్యేక పూజలు చేస్తారు. చంద్రబాబు నిర్వహించే ఈ పాదయాత్రకు వస్తున్నా మీకోసం అనే పేరును పెట్టారు.

హిందూపురం నుండి జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర రాప్తాడు, పెనుగొండ, గుత్తి మీదుగా కర్నూలులోకి ప్రవేశిస్తుంది. అనంతలో 13 రోజులు పాటు పాదయాత్ర కొనసాగుతుంది. 117 రోజులు రోజుకు సుమారు 15 కి.మీ. నుండి 20 కి.మీ. వరకు పాదయాత్ర చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. చంద్రబాబు ఆరవై నాలుగేళ్ల వయస్సులో కూడా ప్రజల కోసం ఈ పాదయాత్ర చేపడుతున్నారని టిడిపి నేత పెద్దిరెడ్డి అన్నారు. టిడిపి తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని, దీనిని ప్రజలకు తెలియజేస్తామని, బాబుకు విల్ పవర్ ఉంద్నారు.

చంద్రబాబు అంతకుముందు అదిలాబాద్ జిల్లా ఉట్నూరు నుండి లేదా మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నుండి పాదయాత్ర చేపట్టాలని చూశారు. కొడంగల్ నుండి దాదాపు సిద్ధమైంది. అయితే చివరి నిమిషంలో అది కూడా రద్దయింది. ఈరోజు అధికారికంగా హిందూపురం నుండి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

కాగా బాబు పాదయాత్ర కోసం సినీ గేయ రచయితలు సుద్దాల అశోక్ తేజ, హరిరామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్ రాసిన పాటలకు వందేమాతరం శ్రీనివాసం సంగీతం అందించారు. అన్నా స్టూడియోలో రికార్డింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. బాబు మార్చింగ్ పైన, బాబు వస్తున్నాడని ఇలా అర్థం వచ్చేట్టు పాటలను రాశారు.

English summary
TDP chief Nara Chandrababu Naidu's Padayatra title is Vastunna Meekosam. Babu has announced on Monday he will start yatra from Hindupur of Anantapur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X