మా వాళ్లకు పదవులేవి!?: చిరు, లిస్ట్ ఇవ్వండి.. కిరణ్

Chiranjeevi - Kiran Kumar Reddy
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తన వర్గం(మాజీ ప్రజారాజ్యం పార్టీ) నేతలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఆదివారం సాయంత్రం క్యాంప్ కార్యాలయంలో కిరణ్‌ను చిరంజీవి కలిశారు. విలీన సమయంలో ఇచ్చిన హామీ మేరకు పిఆర్పీ నుండి కాంగ్రెసులోకి వచ్చిన నేతలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని చిరు ఆయనను కోరారు.

విలీన సమయంలో తనతో పాటు పార్టీలోకి వచ్చిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు చాలామంది వివిధ రకాల పదవులపై ఆశలు పెట్టుకున్నారని, వారికి పదవులు కేటాయించే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోందని చిరు సిఎం వద్ద ఆవేదన వ్యక్తం చేశారట. తన వర్గం వారికి సాధ్యమైనంత త్వరగా నామినేటెడ్, పార్టీ పదవులు ఇవ్వాలని సూచించారట. మాజీ పిఆర్పీ నేతలు ఏ పదవులు లేకుండా ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారని, వారికి ఇప్పటికైనా న్యాయం చేయాలని, అలా ఐతేనే వారి అసంతృప్తిని తగ్గించవచ్చునని చెప్పారట.

నామినేటెడ్ పదవులపై చిరుకు కిరణ్ హామీ ఇచ్చారని తెలుస్తోంది. పదవులకు అర్హులైన నేతల జాబితా ఇవ్వాలని చిరుకు కిరణ్ సూచించారట. అలాగే తాను తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఉప ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు రూ.450 కోట్లు విడుదల చేయాలని కూడా చిరు కోరారు. ఆయన కోరిన వాటిలో నీటి పథకానికి సంబంధించిన నిధులు కూడా ఉన్నాయి.

అలాగే డీజిల్ ధర పెంపు కారణంగా సామాన్య ప్రజలపై అదనపు భారం పడుతున్నందున వ్యాట్ తగ్గించాలని కూడా సూచించారు. అమ్మకాలపై వ్యాట్ తగ్గిస్తే సామాన్య ప్రజలపై అదనపు భారం పడకుండా ఉంటుందని ఆయన కిరణ్‌కు సూచించారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు మరికొన్ని నెలల వరకు తప్పకపోవచ్చునని వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+