చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ విజయమ్మ ఢిల్లీ వెళ్లొచ్చాకే: ఎర్రన్నాయుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yerrannaidu
చిత్తూరు/అనంతపురం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ ఢిల్లీ వెళ్లి వచ్చాకే పరిణామాలు పూర్తిగా మారిపోయాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు గురువారం చిత్తూరు జిల్లాలో అన్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కుమ్మక్కై తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నాయని విమర్శించారు. టిడిపిని దెబ్బతీయడం ఎవరి వశం కాదన్నారు.

తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రను విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదన్నారు. బాబు వస్తున్నా నీకోసం పాదయాత్రతో అన్ని పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందన్నారు. చంద్రబాబు పాదయాత్రతో ప్రజల సమస్యలను, వారి కష్టనష్టాలను తెలుసుకుంటున్నారని ఎర్రన్నాయుడు చెప్పారు.

కుటుంబంతో చెబితే...

తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు కాళ్ల నొప్పులు ఉన్నాయని కుటుంబ సభ్యులతో పిచ్చాపాటిగా మాట్లాడితే ఇతర పార్టీలో హేళన చేయడం సరికాదని అనంతపురం జిల్లాలో పార్టీ నేత అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. తమ అధినేత పైన విమర్శలు చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి వచ్చే ఎన్నికలలో ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.

బాబు యాత్రలో ప్రజలు కాంగ్రెసు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. విద్యుత్ సమస్యలు, కడగండ్ల కష్టాలను ప్రజలు చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. బాబు వారికి అండగా ఉంటానని హామీ ఇస్తున్నారని చెప్పారు. బాబు యాత్రలో ఎక్కడా ప్రభుత్వ వ్యతిరేకత లేదన్న ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు సవాల్ విసిరారు. బొత్సకు దమ్ముంటే ఓ రోజు బాబుతో పాటు పాదయాత్ర చేస్తే ఎంత ప్రభుత్వ వ్యతిరేకత ఉందో అర్థమవుతుందన్నారు.

English summary
Telugudesam Party senior leader YErrannaidu alleged that the state politics were changed after YSR Congress party honorary president YS Vijayamma Delhi tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X