విజయమ్మ దీక్షలో చెప్పు చూపిన రహీమున్నీసా నెత్తిన బతుకమ్మ

 Rahimunnisa
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ కొద్ది నెలల క్రితం కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో చేనేత దీక్ష చేపట్టిన సమయంలో ఓ మహిళ పోలీసు జీపు పైకి ఎక్కి చెప్పు చూపించిన విషయం తెలిసిందే. ఆమె ముస్లిం మహిళ రహీమున్నీసా. ఆమె శనివారం రాత్రి తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలలో పాలు పంచుకున్నారు.

హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ భవనంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా మహిళలు పాల్గొన్నారు. పలువురు ముస్లిం మహిళలు కూడా బతుకమ్మ ఎత్తుకొన్నారు. సిరిసిల్ల విజయమ్మ దీక్షలో చెప్పు చూపించిన రహీమున్నీసా కూడా ఈ వేడుకల్లో బతుకమ్మను నెత్తిన ఎత్తుకొని చిరునవ్వులు చిందించారు. ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

కాగా తెలంగాణవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ తొమ్మిది రోజులు ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు వేడుకలలో పాల్గొంటున్నారు. రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూడా ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి ఆధ్వర్యంలో బతుకమ్మను నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+