వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాస్థాయిని ఎవరూ తగ్గించలేరు: చిరు, గ్రీట్ చేసిన పవన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi - Pawan Kalyan
న్యూఢిల్లీ: తనకు మంత్రి పదవి హోదా కాదని, బాధ్యత అని చిరంజీవి శనివారం అన్నారు. మంత్రిగా ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం రావడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు. ఏ శాఖ కేటాయించినప్పటికీ తాను సమర్థవంతంగా, శక్తిమేరకు నిర్వహిస్తానని చెప్పారు. తనకు మంత్రి పదవి ఇచ్చినందుకు కాంగ్రెసు పెద్దలందరికీ కృతజ్ఞతలు అన్నారు. తన స్థాయిని ఏ పదవులు పెంచలేవనీ, అలాగే తగ్గించలేవని, చిరంజీవికి ప్రజల్లో మంచి ప్రాముఖ్యత ఉందని మెగాస్టార్ ఈ సందర్భంగా చెప్పారు.

పీఆర్పీని కాంగ్రెసులో విలీనం చేసినప్పుడు తాను ఎలాంటి పదవులు అడగలేదని, డిమాండ్లు పెట్టలేదని చెప్పారు. తాను ఎప్పుడూ ప్రజల మనిషినే అన్నారు. ఏ బాధ్యతలు అప్పగించినా సమర్థంగా నిర్వహించి ఆ పదవికే వన్నె తెస్తానని, కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పిస్తున్నట్లు ప్రధాని మన్మోహన్ సింగ్ తనకు చెప్పారని, ఈ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించగలనన్న ధీమా తనకు ఎంతో ఉందని చిరంజీవి విలేకరులతో చెప్పారు.

తనకు కేంద్ర మంత్రి పదవి దక్కిన ఆనందాన్ని కుటుంబ సభ్యులతో కలసి పంచుకుంటున్నానని చిరంజీవి చెప్పారు. తల్లి అంజనాదేవి, భార్య సురేఖ, తనయుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన, తమ్ముడు నాగబాబులతో కలసి తాను ఢిల్లీకి వెళ్తున్నానని వివరించారు. విదేశాల్లో ఉన్న తమ్ముడు పవన్ కల్యాణ్ తనకు శుభాకాంక్షలు తెలిపాడని.. అందుబాటులో ఉంటే ఆయన కూడా తమతోపాటు ఢిల్లీకి వచ్చేవాడని వివరించారు.

తనకు అండదండలు అందిస్తున్న ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, అధిష్ఠానం పెద్దలు అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు విస్తృతంగా కృషి చేస్తానని వివరించారు.

వాణిజ్యశాఖ సవాల్‌తో కూడిన అవకాశమని పురంధేశ్వరి అన్నారు. ఇది తనకు దక్కిన అరుదైన గౌరవమన్నారు. తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. కాంగ్రెసు పెద్దల నమ్మకాన్ని తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయనని కిల్లి కృపారాణి అన్నారు. తాను తన తండ్రి బాటలో నడుస్తానని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చెప్పారు. బలరాం నాయక్, సర్వే సత్యనారాయణలు కూడా అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు.

English summary
Rajyasabha Member Chiranjeevi has responsed on his cabinet position on Saturday. He said no one post will increase or decrease his image.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X