చిరంజీవే చెప్పాలి, జంప్స్‌పై బొత్సది తప్పు: పాలడుగు

ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను పాలడుగు తప్పు పట్టారు. పార్టీ నుండి వెళ్లే వాళ్లు వెళతారని చెప్పడం సరికాదన్నారు. ఒక పార్టీ నుండి గెలిచిన వారు పదవీకాలం పూర్తయ్యే వరకు ఆ పార్టీలోనే కొనసాగాలన్నారు. అది నైతిక ధర్మం అన్నారు. కాంగ్రెసులో ఉండే వారు ఉంటారు, వెళ్లేవారు వెళతారు అని బొత్స వ్యాఖ్యానించడం సరికాదన్నారు.
గుణగణాలు చూడకుండా టిక్కెట్లు కేటాయిస్తే ఇలాంటి ఇబ్బందులే వస్తాయన్నారు. డబ్బుకు కాకుండా సంస్కారాన్ని చూసి టిక్కెట్లు ఇవ్వాలని సూచించారు. పార్టీ ఫిరాయింపుదారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. అలా అయితేనే ఫిరాయింపులను అడ్డుకోగల్గుతామన్నారు.












Click it and Unblock the Notifications