హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్‌కు చెక్ చెప్పేందుకు నాగం వైపు బిజెపి చూపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Venugopala Chary-Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు, నాగర్ కర్నూలు శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ నేతలు సోమవాహం మధ్యాహ్నం కలువనున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిలు నాగంను మధ్యాహ్నం ఒకటి గంటలకు కలువనున్నారు. ఆయనను వారు పార్టీలోకి ఆహ్వానించనున్నారు.

నాగంతో భేటీ అయి ఆయన పార్టీలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారు. అదేవిధంగా నాగం జనార్ధన్ రెడ్డితో పాటు తెలంగాణ కోసం బయటకు వచ్చిన అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే వేణుగోపాల చారిని కూడా రెండు రోజుల్లో బిజెపి నేతలు కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆయనను కూడా పార్టీలోకి ఆహ్వానించనున్నారు. రాష్ట్రంలో బిజెపి ఏమాత్రం పట్టులేదు. అయితే తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఆ ప్రాంతంలో పార్టీ క్రమంగా పుంజుకుంటోంది.

తెలంగాణ అంటే టిఆర్ఎస్ - టిఆర్ఎస్ అంటే కెసిఆర్ అన్న భావన నుండి ఇటీవల క్రమంగా ప్రజలు బయటపడుతున్నారు. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న అన్ని పార్టీలకు మద్దతు పలుకుతున్నారు. టిఆర్ఎస్ తర్వాత తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న పార్టీల్లో బిజెపి వైపు ప్రజలు క్రమంగా మొగ్గు చూపుతున్నారు. అయితే తెరాస చీఫ్ కె చంద్రశేఖర రావు ఒంటెత్తు పోకడలపై బిజెపి గుర్రుగా ఉంది.

దీంతో తెరాసకు ధీటుగా బిజెపిని తెలంగాణలో నిలబెట్టాలని ఆ పార్టీ నేతలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. తెలంగాణ కోసం బిజెపి ఇటీవల తీవ్రంగా ఉద్యమిస్తోంది. జెఏసితో కలిసి పని చేస్తోంది. ఉద్యమంతో పాటు ఇమేజ్ ఉన్న నేతలను పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్ధపడింది. అందులో భాగంగా నాగం, వేణుగోపాల చారికి బిజెపిలోనికి ఆహ్వానించేందుకు రాష్ట్ర నేతలు ప్రయత్నిస్తున్నారు. నాగం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు.

English summary
BJP leaders Kishan Reddy, Bandaru Dattatreya and Yennam Srinivas Reddy will meet Nagarkurnool MLA Nagam Janardhan Reddy on Monday afternoon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X