అన్నీ పడక సీన్లే: 'ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజం'పై కమిటీ

రాష్ట్ర మహిళాశిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి నీలం సహానీ చైర్మన్‌గా మరో ఎనిమిది మంది సభ్యులుగా ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ కమిటీ ఈ నెల 5వ తేదీన ఈ చిత్రాన్ని పరిశీలించి, నివేదికను రూపొందించింది. ఈ నివేదికను కమిటీ సమన్వయకర్త, ఆంధ్రప్రదేశ్ చలనచిత్రాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ వి చంద్రవదన్ బుధవారం ప్రభుత్వానికి నివేదికను అందించారు.
అశ్లీలం, ఆసభ్యత, శృంగారమే లక్ష్యంగా కేవలం పడక సీన్లతో చిత్రాన్ని నిర్మించారని, చిత్రాన్ని పూర్తిగా నిషేధించాలని కమిటీ అభిప్రాయపడింది. చిత్రంలోని సన్నివేశాలు ఒక కులాన్ని కించపరిచేవిగా ఉన్నాయని, ఈ చిత్రం ప్రజా ప్రదర్శనకు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని కమిటీ ప్రభుత్వానికి నివేదించింది.
కాగా, మోహన్‌బాబు కుమారుడు మంచు విష్ణు నటించిన దేనికైనా రెడీ చిత్రం కొత్త మలుపు తిరిగింది. చెన్నై, తిరుపతి నుంచి వచ్చిన బ్రాహ్మణులు మోహన్‌బాబుకు అండగా నిలిచారు. పిండ ప్రదానం చేసిన గుంటూరు జిల్లా బ్రాహ్మణులను వారు తప్పు పట్టారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణులు చెన్నై బ్రాహ్మణులతో విభేదించారు. దేనికైనా రెడీ సినిమా చూసి మాట్లాడాలని వారు హితవు పలికారు. మోహన్ బాబు మాత్రం వివాదంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు.












Click it and Unblock the Notifications