వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికలు: హోరాహోరీ, మిట్ రోమ్నీకి ఒబామా కంగ్రాట్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Barack Obama - Mitt Romney
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఉత్కంఠలో ముంచెత్తాయి. ఎవరు గెలుస్తారనే అంశంపై అందరూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రత్యర్థి మిట్ రోమ్నీ మధ్యన హోరా హోరీగా సాగుతోంది. ఫలితాల్లో మొదట ముందంజలో ఉన్నట్లుగా కనిపించిన రోమ్నీ కొద్ది సేపటికి వెనుక పడ్డారు. హోరాహోరీగా ఉన్నప్పటికీ ఒబామా కొద్దిగా ముందంజంలో ఉన్నారు.

అందిన ఫలితాల ప్రకారం రోమ్నీకి 174 ఓట్లు రాగా, ఒబామాకు 173 వచ్చాయి. ఓహియో, అయోవా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో ఒబామా అధిక్యం కొనసాగుతోంది. వర్జీనియా, విస్కానిసిస్ తదితర రాష్ట్రాల్లో రోమ్నీ ముందంజలో ఉన్నారు. అధ్యక్ష పీఠం అధిరోహించాలంటే 538 ఎలక్టోరల్ ఓట్లలో 270 సాధించాల్సి ఉంటుంది.

కాగా అంతకుముందు బరాక్ ఒబామా తన ప్రత్యర్థి మిట్ రోమ్నీకి కంగ్రాట్స్ చెప్పారు. తనతో పోటీ పడి మరీ ఉత్సాహంగా ప్రచారం చేసినందుకు రోమ్నీకి శుభాకాంక్షలు చెప్పారు. అమెరికా అధ్యక్ష పీఠం కోసం ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపు జరుగుతోంది.

English summary
Congratulating his Republican rival Mitt Romney for running a spirited campaign, US President Barack Obama expressed confidence he would win re-election during a surprise stop at a local campaign office to thank volunteers. "The great thing about these campaigns is after all the TV ads and all the fundraising and all the debates and all the electioneering, it comes down to this. One day and these incredible folks who are working so hard, making phone calls, making sure that people go out to vote. So I just want to say thank you to the American people," Obama said making a stop at one of his Chicago campaign office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X