• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమెరికా ప్రపంచ మార్గదర్శి: భవిష్యత్‌పై ఒబామా హామీ

By Srinivas
|

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బరాక్ ఒబామా అమెరికా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి అమెరికా ప్రజలు, డెమోక్రాట్ల ఆనందోత్సాహాల మధ్య మాట్లాడారు. ఈ విజయం అమెరికా ప్రజలందరిదీ అన్నారు. మీ అందరి వల్లే తన విజయం సాధ్యమైందని, మనది అంతా ఒకే అమెరికా కుటుంబం అన్నారు. ఎన్నికల్లో పోటీ అనేది ఒకే జాతి, ఒకే ప్రాతిపదికననే జరిగిందన్నారు.

 Obama victory speech

తన విజయానికి కృషి చేసిన వారందరీకి తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. తాను దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకు వచ్చేందుకు మీరిచ్చిన ఉత్సాహంతో మరింత కృషి చేస్తానని చెప్పారు. తాను ఇతరులతో చర్చల్లో పాల్గొన్న ప్రతిసారి ఉమ్మడిగా దేశాన్ని ఎలా ముందుకు తీసుకు వెళ్లాలనే దాని పైనే మాట్లాడానని చెప్పారు. తనపై విశ్వాసం ఉంచి గెలిపించిన వారందరికీ ధన్యవాదాలు అన్నారు.

ప్రచారంలో తనకు ఎందరో అండగా నిలిచారని, వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు అన్నారు. పార్టీలు వేరైనా తాను రోమ్నీతో కలిసి పని చేస్తానని చెప్పారు. దేశాన్ని అభివృద్ధి చేసేందుకు, మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు రోమ్నీ సలహాలు, సహాయం తీసుకుంటానని చెప్పారు. దేశాన్ని ముందుకు నడిపించిన రోమ్నీ సహాయం ఎంతో అవసరమన్నారు. 30 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో చాలా సమస్యలు ఉన్నాయన్నారు.

రోమ్నీ గట్టి పోటీనిచ్చారన్నారు. రోమ్నీ మంచి దేశభక్తుడు అన్నారు. రాజకీయాల్లో పోటీ అనేది వైరుధ్యం కాదన్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని మరోసారి గుర్తు చేశారన్నారు. నిరాశ, నిస్పృహ నుండి దేశాన్ని బయట పడేస్తానన్నారు. సమస్యల పరిష్కారానికి అందరూ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. మన మధ్య బేధాభిప్రాయాలు ఎన్ని ఉన్నప్పటికీ అందరి దృష్టి మాత్రం అమెరికా భవిష్యత్తు మీదే ఉండాలన్నారు.

అమెరికా సైనిక పటాలం ఎప్పుడూ ప్రపంచంలోనే ఉత్తమమైనదిగా ఉంటోందన్నారు. ఆర్థిక మాంద్యానికి మన భవిష్యత్తు తరాలు బలి కాకూడదని, దానిని సమర్థవంతంగా ఎదుర్కొందామన్నారు. అమెరికా పౌరులు ఎప్పుడు కూడా మాకేం చేస్తారని ఆలోచించరని, మనమందరం కలిసి ప్రపంచానికి ఏం చేద్దామని ఆలోచిస్తారన్నారు. ప్రపంచ సంపద వృద్ధికి మనం ఏం చేయాలో ఆలోచించాలన్నారు. అమెరికా చాలా ఉన్నతమైనదని, ప్రపంచానికి మార్గనిర్దేశనం చేస్తుందన్నారు.

మన ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటోందని, ఆర్థిక వ్యవస్థను ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్తామన్నారు. మన బలం సైనిక పటాలం ఒక్కటే కాదని, విభిన్న సంప్రదాయాలతో కూడిన ప్రజల సంగమమే మనం బలం అన్నారు. ఎన్నో క్లిష్ట సమస్యలు ఉన్నప్పటికీ ఆత్మస్థైర్యం మనల్ని ముందుకు నడిపిస్తుందన్నారు. సగటు అమెరికా పౌరులకు భవిష్యత్తుపై భరోసా కల్పించడమే మన లక్ష్యం అన్నారు. మరింత స్థిర చిత్తం, కొత్త స్ఫూర్తితో శ్వేత సౌధంలోకి మరోసారి అడుగుపెడుతున్నానని చెప్పారు. థ్యాంక్యూ అమెరికా అంటూ ఒబామా తన ప్రసంగాన్ని పూర్తి చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home

English summary
President Obama will win re-election, Fox News projects. The call comes after the president was the projected winner in the crucial battleground of Ohio, and subsequently won both Iowa and Oregon. This put Obama over the required 270 electoral votes.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more