ఓటమిని అంగీకరించిన మిట్ రోమ్నీ: ఒబామాకు ఫోన్

ఆ సమస్యలను ఒబామా అధిగమిస్తాడని తాను మనస్ఫూర్తిగా నమ్ముతున్నట్లు చెప్పారు. అమెరికా సమస్యల్ని తొలగించడంలో ఒబామా సక్సెస్ అవుతారని తాను గట్టిగా నమ్ముతున్నానన్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో తనకు సహకరించిన వారిందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. తాను ఒబామాకు ఫోన్ చేసి అభినందనలు తెలియజేశానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
12వసారి రెండో అధ్యక్షుడిగా ఒబామా
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన నల్ల సూరీడు బరాక్ ఒబామా రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న వారిలో పన్నెండో వ్యక్తి. అమెరికా అధ్యక్షుడిగా అత్యధిక కాలం రూజ్ వెల్ట్ పని చేశారు. అమెరికా 44వ అధ్యక్షుడిగా ఒబామా గెలిచారు.
అయితే ప్రస్తుత నియమావళి ప్రకారం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండుసార్ల కంటే ఎక్కువసార్లు పోటీ చేసేందుకు అవకాశం లేదు. ఒబామా పోటీ చేసి గెలుపొందటం ఇది రెండోసారి. కాగా ఎన్నికల్లో ఒబామా గెలుపొందడంతో అమెరికాలో డెమోక్రాట్లు ఆనందంలో మునిగి తేలుతున్నారు.












Click it and Unblock the Notifications