తెలంగాణ: 2014లో కెసిఆర్, వైయస్ జగన్ మధ్యే ఫైట్?

K Chandrasekhar Rao-YS Jagan
హైదరాబాద్: తెలంగాణకు సంబంధించి రాజకీయం చిత్రిక కడుతున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ ఇవ్వదనే విషయం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మాటలతో తేలిపోయింది. నిజానికి, కెసిఆర్‌కు తప్ప ఎవరికీ కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందనే అభిప్రాయం లేదు. అయితే, కెసిఆర్ ప్రకటనతో తెలంగాణలో రాజకీయ సమీకరణాల స్థితిగతులు ఎలా ఉండవచ్చుననే విషయంపై కొంత స్పష్టత వస్తోంది.

వచ్చే ఎన్నికల్లో తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలే మొదటి రెండు స్థానాల్లో ఉంటాయని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. వాస్తవం కూడా అలాగే ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2014 ఎన్నికలే లక్ష్యంగా కెసిఆర్ తన రాజకీయ, ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుడుతున్నారు. దీంతో రాజకీయ సమరం జోరందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలోని ఓ వర్గం వైయస్సార్ కాంగ్రెసు వైపు చూస్తోంది. వలసలు కూడా ప్రారంభమయ్యాయి. అందుకు దీటుగా కెసిఆర్ కూడా వలసలను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెసు పార్టీ తుడిచిపెట్టుకు పోతుందని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. ఆ వాదన చేసే తమ పార్టీ నాయకులను ధైర్యంగా ఖండించలేని స్థితి కాంగ్రెసు పార్టీలో నెలకొని ఉంది. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీని మాత్రమే టార్గెట్ చేసుకున్న కెసిఆర్ ఇక నుంచి కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను లక్ష్యం చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. తెలంగాణ ప్రజలకు తన వాదనను బలంగా వినిపించేందుకు అవసరమైన కార్యాచరణను కూడా కొంత మేర ప్రకటించారు.

నిజానికి తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో మంచి క్యాడర్ ఉంది. అయితే, తెలంగాణపై పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైఖరి కారణంగా ఆ పార్టీ కార్యకర్తలు ఎంత కాదన్నా నిస్పృహతోనే ఉన్నారు. తాము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమే గానీ తెలంగాణ అంశం మీద సమర్థించలేమనే వాదన ఆ పార్టీలో వినిపిస్తోంది. అయితే, చంద్రబాబు వస్తున్నా.. మీకోసం పాదయాత్ర తెలంగాణలో ముగిసిన తర్వాత పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నారు. ఆ పార్టీ తెలంగాణ నాయకులు చంద్రబాబు పాదయాత్రపై చాలా ఆశలు పెట్టుకున్నారు.

అయితే, తెరాసను ధీటుగా ఎదుర్కోగలమనే ధీమా మాత్రం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కనిపిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో, దక్షిణ తెలంగాణలో తమకు తగినన్ని సీట్లు వస్తాయనే ధీమాతో ఆ పార్టీ నాయకులు ఉన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు పంచుకుంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే విషయంపై పెద్దగా అంచనా లేదు. తెరాసను ఎదుర్కోవడానికి ఆ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలపై కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దృష్టి పెట్టింది. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెసు, తెరాస మధ్యనే పోటీ ఉంటుందనే వాతావరణం ఉన్నప్పటికీ ఎన్నికలు సమీపంచేనాటికి పరిస్థితిలో మార్పు రాదని చెప్పలేమని కూడా అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+