పూలరంగడనుకుంటే: కెసిఆర్‌పై టిజి, తెలంగాణపై సలహా

అప్పటి వరకు ఎవరు కూడా అభివృద్ధిని అడ్డుకోవద్దని సూచించారు. కెసిఆర్‌కు తెలంగాణ సాధన విషయంలో టిజి వెంకటేష్ ఓ సలహా కూడా ఇచ్చారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో కెసిఆర్ తెలంగాణ ప్రాంతంలోని అన్ని సీట్లు గెలుచుకొని కేంద్రంపై తెలంగాణ ఇవ్వాలని ఒత్తిడి తీసుకు రావాలన్నారు. కెసిఆర్ నరసింహావతారం ఎత్తినా సామరస్యంగా ఉండాలని సూచించారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టవద్దని కెసిఆర్‌కు సూచించారు.
మెదక్ జిల్లా సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) కూడా కెసిఆర్ నరసింహావతారం వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కెసిఆర్ నరసింహావతారం ఎత్తితే అందుకు విరుగుడు తమ వద్ద ఉందన్నారు. శ్రీమహావిష్ణువు ఆ అవతారం ఎత్తితే మహాలక్ష్మి వద్ద విరుగుడు ఉన్నట్లుగానే తమ వద్ద కూడా అది ఉందన్నారు.












Click it and Unblock the Notifications