వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకేష్, జగన్ భవిష్యత్తుపై జోస్యం: కెసిఆర్ వల్లే సాధ్యం

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao - YS Jagan - Nara Lokesh
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ తదితరుల భవిష్యత్తుపై ప్రముఖ హస్త సాముద్రిక నిపుణులు రమణా రావు జోస్యం చెప్పారు. వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.

నారా లోకేష్ రాజకీయాల్లో రాణిస్తారని చెప్పారు. లోకేష్ రాజకీయ జీవితం మహాద్భుతంగా ఉంటుందని చెప్పారు. చంద్రబాబు కంటే నారా లోకేష్‌కే బాగుందన్నారు. ప్రస్తుతం వ్యక్తిగతంగా జగన్‌కు బాగాలేదని అందుకే ఆయనకు ఇంకా బెయిల్ రావట్లేదన్నారు. వ్యక్తిగతంగా గ్రహస్థితి బాగా లేదన్నారు. అయితే రాజకీయ భవిష్యత్తు మాత్రం అద్భుతంగా ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వల్లనే తెలంగాణ సాధ్యమని చెప్పారు.

తెలంగాణ వస్తుందని తాను ఎప్పుడో చెప్పానని, మూడేళ్ల క్రితం డిసెంబర్ 9న కేంద్రం ప్రకటించి వెనక్కి వెళ్లిందన్నారు. ఇప్పటికైనా తెలంగాణ వస్తుందన్నారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ 2014లో ప్రధానమంత్రి కావడం కష్టమే అన్నారు. అతను మరో రెండు మూడు నెల్లలో మన్మోహన్ స్థానంలో ప్రధానిగా బాధ్యతలు చేపడితే పరిస్థితిలో కొంత మార్పు రావొచ్చునని చెప్పారు. లేదంటే ప్రధానిగా గెలవడం కష్టమే అన్నారు.

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రెండోసారి గెలుస్తారని తాను ముందే చెప్పానని అన్నారు. తాను చెప్పినట్లుగానే జరిగిందన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాగలరో లేదో తాను చూడలేదని, చూసిన తర్వాత తాను చెప్పగలుగుతానన్నారు. వారి నుండి తనకు పిలుపు వచ్చిందని, ఎన్నికల హడావుడి ఉన్నందున వెళ్లలేదని, తర్వాత వెళ్తానని చెప్పారు.

English summary

 Astrologer Ramana Rao said Nara Lokesh's and YS Jaganmohan Reddy's future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X