హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏంజరిగినా మతాన్నిముందుకు తెస్తోంది: మజ్లిస్‌పై టిజి

By Srinivas
|
Google Oneindia TeluguNews

 TG Venkatesh
హైదరాబాద్/కర్నూలు: రాజకీయ కారణాల వల్లే మజ్లిస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుందని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ బుధవారం కర్నూలులో అన్నారు. ఏం జరిగినా మజ్లిస్ పార్టీ మతాన్ని ముందుకు తీసుకు వచ్చి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకోవడానికే ఇలాంటి రాజకీయాలు చేస్తోందన్నారు.

వెనుకబడిన కర్నూలు జిల్లాకు నిధులు పెంచాలని ఆయన కేంద్రాన్ని కోరారు. కాంగ్రెసుతో పోటీపడి రాయలసీమలో గెలవలేమనే మజ్లిస్ ఇలా చేస్తోందన్నారు. మజ్లిస్ పార్టీతో చర్చలు కొనసాగుతున్నాయని హైదరాబాదులో కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ అన్నారు. కాంగ్రెసు పార్టీ ఒక్కటే అసలైన సెక్యులర్ పార్టీ అన్నారు. భారతీయ జనతా పార్టీ మత విద్వేషాలను రెచ్చగొడుతోందన్నారు. పాతబస్తీలో జరిగిన సంఘటనతో ముస్లింల మనోభావాలు దెబ్బతిని ఉంటాయని తాము భావిస్తున్నామన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డియే 2014 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని మంత్రి కొండ్రు మురళీ మోహన్ వేరుగా అన్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మజ్లిస్ పార్టీతో చర్చలు జరుగుతున్నాయని, అవి ఫలవంతమవుతాయని తాము భావిస్తున్నామన్నారు.

మజ్లిస్ పార్టీ నేతలతో అధిష్టానం కూడా సంప్రదింపులు జరుపుతోందని ఎంపి ఎంఏ ఖాన్ అన్నారు. కాంగ్రెసుకు మద్దతు ఉపసంహరణపై వారు పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పాలనాపరంగా తప్పిదాలు ఏవైనా జరిగి ఉంటే సరిదిద్దుకుంటామన్నారు.

English summary

 Andhra Pradesh minister for minor irrigation, TG Venkatesh has blamed MIM party for withdraw support to Kiran Kumar Reddy's government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X