హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షర్మిలది రాక్షసానందం, లోకజ్ఞానం లేదు: శోభారాణి

By Pratap
|
Google Oneindia TeluguNews

Sharmila
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో అడుగు పెట్టడానికి ముందు నానా యాగీ చేసిన తెలంగాణ జెఎసి నేత కోదండరామ్, ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి, తెరాస నేత జితేందర్ రెడ్డి షర్మిల పాదయాత్ర సమయంలో ఏ కలుగులో దాక్కున్నారని తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి శోభారాణి ప్రశ్నించారు. చంద్రబాబు వచ్చిన రోజు కోదండరాం తెలంగాణ సరిహద్దుల వరకూ వచ్చి ధర్నా చేయాలని ప్రయత్నించారని, షర్మిల వచ్చిన రోజు ఆయన ఏమయ్యారో కంటికి కూడా కనిపించలేదని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

తాను మహిళగా మాట్లాడితే బాగుండదనిస తెరాస అధ్యక్షుడు కెసిఆర్ ఇంటి దగ్గర ఆయన గ్లాసులో ఐసు కలుపుతూ కూర్చుని ఉద్యోగ సంఘాల నాయకులతో ములాఖతులు పెట్టిస్తున్నట్లుందని ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబుకైతే నిరసనలు, షర్మిలకైతే రెడ్ కార్పెట్, ఇదేనా వారి తీరు అని ఆమె అడిగారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చెల్లెలు షర్మిల తన తండ్రి కోసం చనిపోయిన వారిని చూసి గర్వ పడుతున్నానంటూ రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. మరణించినవారి కోసం బాధపడాలి గానీ చనిపోయిన వారిని చూసి గర్వపడటం ఏమిటని ఆమె అడిగారు. తనకు సర్వం తెలుసన్నట్లు మాట్లాడుతున్న షర్మిల కాస్త లోకజ్ఞానంతో వ్యవహరిస్తే బాగుంటుందని శోభారాణి హితవు పలికారు.

పాదయాత్ర సందర్భంగా తెలంగాణలో అడుగు పెట్టిన తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాలో షర్మిల చేసిన తొలి ప్రసంగాన్ని ఆమె ఈ సందర్భంగా మీడియా ముందు ప్రదర్శించారు. జలయజ్ఞం పనులు తెలంగాణలోనే బాగా చేశామని, పోలవరం వంటి ప్రాజెక్టులు చేపట్టామని షర్మిల అంటున్నారని, షర్మిలకు ఎల్లలు తెలియవని, ఏ ప్రాజెక్టు ఎక్కడ ఉందో.. ఏ ప్రాజెక్టుపై ఏ ప్రాంతం వారి మనోభావాలు ఎలా ఉన్నాయో తెలియవని శోభారాణి అన్నారు.

తెలంగాణకు పోలవరానికి ఏమైనా సంబంధం ఉందా? అని ఆమె అడిగారు. పోలవరం గురించి చెప్పి.. తెలంగాణలో పనులు బాగా చేశామని ఆమె చెబితే వింటున్న ప్రజలు నవ్వాలా...ఏడవాలా? షర్మిల మాటలకు అదే వాహనంలో ఆమె వెనుక నిలబడిన జిట్టా బాలకృష్ణారెడ్డి వంటి తెలంగాణ నేతలు నవ్వుకొంటున్నారని, అదీ ఆమె పరిస్ధితి అని శోభారాణి అన్నారు.

English summary
Telugudesam state secretary Sobha Rani has lashed out at YSR Congress president YS Jagan's sister Sharmila comments. She said that Sharmila is not having any knowledge about the boarders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X