వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెరాస విలీనమే: మందకృష్ణ, డబ్బుకే జగన్‌వైపు: హరీష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harish Rao - Manda Krishna Madiga
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మంగళవారం నిప్పులు చెరిగారు. తెరాస కాంగ్రెసు పార్టీ తొత్తు అని విమర్శించారు. తెరాస ఎప్పటికైనా కాంగ్రెసు పార్టీలో విలీనం కావడం ఖాయమన్నారు. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న విమలక్క పైన అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసినా తెరాస ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

విమలక్కపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిందని మండిపడ్డారు. మాదిగలను దగా చేసిన కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా ఈ నెల 8 నుండి 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. మార్చి 3వ తేదిన మాదిగల ఆత్మగౌరవ విశ్వరూప మహాసభను నిర్వహిస్తామని చెప్పారు. విమలక్క విడుదల కోసం తాము జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని అన్నారు.

విమలక్క అరెస్టును నిరసిస్తూ ఈ నెల 15న విద్యాసంస్థల బందుకు పిలుపునిచ్చారు. ఈ నెల 20వ తేదిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విమలక్క నిర్బంధ వ్యతిరేక సభను నిర్వహిస్తామని చెప్పారు. విమలక్కను వెంటనే విడుదల చేయకుంటే కాంగ్రెసు పార్టీకి దెబ్బతినక తప్పదన్నారు.

జగన్ పైన హరీష్ రావు

డబ్బు కోసమే కొందరు తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపుకు వెళ్తున్నారని ఆరోపించారు. జగన్ పార్టీ వైపు వెళ్లే వారంతా తెలంగాణ వ్యతిరేకులే అన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఎఫ్‌డిఐ ఓటింగును బహిష్కరించాలని సూచించారు.

English summary

 MRPS president Manda Krishna Madiga said TRS party will merge in Congress party soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X