నేతగా సమర్థుడ్ని కాదు, పార్టీ స్థాపించను: రజనీకాంత్

ఈ సందర్భంగా ఆయన తనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని చెప్పారు. తనలో సమర్థవంతమైన నాయకుడు లేడన్నారు. రాజకీయ పార్టీ స్థాపించాలనే ఉద్దేశ్యం తనకు ఏమాత్రం లేదని చెప్పారు. బ్రతికేందుకు ఓ మంచి జీవితాన్ని ప్రసాదించిన తమిళనాడు ప్రజలకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు.
ఈ నెల 12వ తేదిన రజనీకాంత్ పుట్టిన రోజు. దీంతో ఆయన 62వ పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకొని గురువారం రాత్రి ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యారు. ఈ సమయంలో అభిమానులు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర వహించాలని కోరగా ఆయన సున్నితంగా తిరస్కరించారు.












Click it and Unblock the Notifications