వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షర్మిల బర్త్ డే: కల్సిన వైయస్ వివేకానంద, పరామర్శ

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vivekananda and Sharmila
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలను కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు సోమవారం పరామర్శించారు. వైయస్ జగన్ బాబాయి, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి ఉదయం షర్మిలను కలిసి మోకాలి దెబ్బ విషయమై అడిగి తెలుసుకున్నారు. వైవి సుబ్బారెడ్డి, వైయస్ భారతి రెడ్డి, శోభా నాగి రెడ్డి తదితరులు షర్మిలను పరామర్శించారు.

ఈ రోజు షర్మిల పుట్టిన రోజు. వివేకానంద రెడ్డి ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు, అభిమానుల షర్మిల పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. షర్మిలకు ఆపరేషన్ డాక్టర్ సోమశేఖర రెడ్డి, రఘువీరా రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుందని శోభా నాగిరెడ్డి చెప్పారు. పాదయాత్ర ఎక్కడ ఆగిందో తిరిగి అక్కడి నుండే ప్రారంభమవుతుందని చెప్పారు.

5 జిల్లాలో 822 కిలోమీటర్లు

వాహనం పైనుండి కింద పడటంతో షర్మిల మోకాలి తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. ఆమెకు గురువారం కీహోల్ ఆపరేషన్ చేయనున్నారు. మూడు వారాల విశ్రాంతి అవసరమని అపోలో వైద్యులు చెప్పారు. దీంతో ఆమె మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు మూడు రోజులు బ్రేక్ రానుంది. ఇప్పటి వరకు షర్మిల నాలుగు జిల్లాల్లో పాదయాత్ర నిర్వహించారు. కడప, అనంతపురం, కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఆమె పాదయాత్ర పూర్తయింది.

రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేస్తుండగా మోకాలికి గాయమైంది. దీంతో మొదట రెండు రోజులు విశ్రాంతి అవసరమని భావించారు. గాయం పెద్దదిగా తేలడంతో మూడు వారాల విశ్రాంతి కావాలని వైద్యులు సూచించారు. షర్మిల ఐదు జిల్లాల్లో కలిపి ఇప్పటి వరకు 57 రోజులు పాదయాత్ర చేశారు. 822 కిలోమీటర్ల దూరం నడిచారు. 24 నియోజకవర్గాలలో పర్యటించారు. అక్టోబర్ 18న కడప జిల్లా ఇడుపులపాయ వద్ద ఆమె పాదయాత్ర ప్రారంభమైంది.

English summary
Former minister YS Vivekananda Reddy has visted YSR Congress party chief YS Jaganmohan Reddy's sister Sharmila on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X