జగన్ పార్టీలో పిఆర్పీ లక్షణాలు: రామజోగయ్య వివరణ

ఆయన జైలుకు వెళ్లిన తర్వాత కూడా మనం జనంలో ఉండాలని పార్టీ నేతలకు సూచించానన్నారు. జగన్ వలే ప్రజలకు భరోసా కల్పించాలని చెప్పానని, అలా కాకుండా ఇంట్లో కూర్చుంటే ప్రజారాజ్యం పార్టీ గతి పడుతుందని మాత్రమే అన్నానని హరిరామ జోగయ్య చెప్పారు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ఆయనను ఇమేజ్‌తో ఓట్లు పడతాయని ఎవరూ కష్టపడకుండా అందరూ ఇంట్లో కూర్చున్నారన్నారు.
అందుకే అధికారంలోకి రాలేదన్నారు. జగన్‌ను, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని కూడా చూపించి ఇంట్లో కూర్చోవడం సరికాదని, ప్రజల్లో ఉండాలని హెచ్చరించేందుకే తాను అలా అన్నానని చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలను హెచ్చరించేందుకు చెప్పానన్నారు. తాను గతంలో ఉన్న ప్రతి పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. అయితే ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు తాను ఎమ్మెల్యేగా పోటీ చేయలేదని అందుకే అధికారంలోకి రాకపోయి ఉండవచ్చునని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నెగ్గేదేమో అన్నారు.
కాగా వైయస్ జగన్ నాయకత్వంలోని తమ పార్టీపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు హరిరామ జోగయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుత వైఖరి కొనసాగితే ప్రజారాజ్యం పార్టీ గతే తమ పార్టీకి పడుతుందని ఆయన అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బుధవారం నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో జోగయ్య మాట్లాడారు. సహకార ఎన్నికలు ఒక ప్రధాన అజెండాగా నిర్వహించిన సమావేశంలో నాయకులు దానిపై ఎటువంటి ప్రణాళికను ప్రకటించకపోవడంపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications