బెంగళూర్, బెంగాల్లో ఢిల్లీ రిపీట్: రేప్‌కేస్‌లో పదేళ్లు జైలు

Bengal woman set on fire
ముంబయి/బెంగళూరు: పక్కింటి అమ్మాయిని బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన ఓ యువకిడికి ముంబయి సెషన్స్ కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2009లో ఓ కళాశాల వద్ద బాధితురాలి సెల్‌ఫోన్‌ను నిందితుడు వినాయక్ లాక్కొన్నాడు. సెల్ కోసం అతని వెనకాల పరుగెత్తిన ఆమెను ముగ్గురు వ్యక్తుల సాయంతో బలవంతంగా కారులోకి ఎక్కించాడు. రత్నగిరి ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

పెళ్లి చేసుకుంటానని బాధితురాలికి హామీ ఇచ్చాడు. ఆ తర్వాత తప్పించుకోవాలని చూశాడు. బాధితారులు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అతనిని అరెస్టు చేసి విచారణ జరిపారు. కేసు విచారణ అనంతరం వినాయక్‌కో కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.

కర్నాటక రాజధాని బెంగళూరులో పదిహేనేళ్ల అమ్మాయిపై ఓ దుకాణ యజమాని మంగళవారం అత్యాచారం చేశాడు. తన దుకాణంలోకి వచ్చిన అమ్మాయితో యజమాని తీయగా మాట్లాడి... ఆ తర్వాత లోపలకు లాగాడు. దుకాణం షట్టర్‌ను మూసివేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సమయంలో ఇద్దరు అతనికి సహాయం చేశారు. ఈ ఘటన కాడుగోడిలోని పటాలమ్మ దేవస్థానం సమీపంలో చోటు చేసుకుంది. రాత్రి ఎనిమిది గంటలకు జరిగింది. ఈ ఘటనల పోలీసులు అశ్వత్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

కర్ణాటకలోనే బీదర్ జిల్లాలోని ఆళవాయి గ్రామంలో మంగళవారం జరిగింది. ఐదేళ్ల చిన్నారిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. చిన్నారిని హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

పశ్చిమబెంగాల్‌లో మరో ఘాతుకం జరిగింది. 24 ఏళ్ల యువతిపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడి తర్వాత ఆమెపై కిరోసిన్ పోసి తగులబెట్టారు. తీవ్రగాయాలతో ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉంది. సిలిగురి సమీపంలోని రామ్‌జోతా గ్రామంలో సునీల్ దాస్ కుటుంబం నివసిస్తోంది. బుధవారం ఇంటికి సమీపంలో మంటలలో కాలిపోతున్న యువతిని గమనించిన స్థానికులు సునీల్‌కు చెప్పారు. తక్షణం ఆ యువతిని ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+