హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్లైట్‌లో మహిళ పట్ల ఐటి ఆఫీసర్ వెకిలి: బ్యాగ్ గాయబ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tirupati
హైదరాబాద్/చిత్తూరు: ఓ ఐటి అధికారి హైదరాబాద్ - తిరుపతి స్పైస్ జెట్ విమానంలో ఓ మహిళ పట్ల వెకిలిగా ప్రవర్తించడంతో రేణిగుంట పోలీసులు అతనిని సోమవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నరు. హైదరాబాదు నుండి తిరుపతి వచ్చిన విమానంలో ఐటి అధికారి జయశంకర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని మహిళ రేణిగుంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు అతనిని అదుపులోకి తీసుకున్నారు. వేధింపులకు గురైన మహిళ రైల్వేలో ఉన్నతాధికారిగా పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

శంషాబాదులో విదేశీ మహిళ బ్యాగ్ చోరీ

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హై సెక్యూరిటీ జోన్‌లో ఓ మహిళ గ్యాబ్ అదృశ్యమైంది. ఆమె ఇథియోపియా నుండి హైదరాబాదుకు వచ్చింది. ఆమె బ్యాగ్ ఈ రోజు మిస్ అయింది. ఆమె శంషాబాద్ విమానాశ్రయ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన బ్యాగులో బంగారు ఆభరణాలు, నగదు ఉన్నాయని ఆమె పోలీసులకు చెప్పింది.

ఆరు కోట్లతో వ్యాపారీ పరారు

గుంటూరు జిల్లా మంగళగిరి కొత్తపేటలో శ్రీనివాస రావు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆరు కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించాడు. అతని ఇంట్లో పోలీసులు సోమవారం సోదాలు నిర్వహించారు.

రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని దొరవారిసత్రం అటవీప్రాంతం సమీపంలో రైలు క్రింద పడి ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. రైలు కింద పడటంతో ఇరువురి మృతదేహాలను నుజ్జునుజ్జు అయ్యాయి. రెండు, మూడు రోజుల క్రితమే ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

English summary
A woman was assaulted by IT officer on Monday in Hyderabad - Tirupati spice jet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X