స్త్రీలు వంటింటి కుందేళ్లే కావాలి: భగవత్ మరో వ్యాఖ్య

Mohan Bhagwat
ఇండోర్: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మరో వివాదాన్ని సృష్టించారు. అత్యాచారాలు భారతదేశంలోనే జరుగుతాయని, ఇండియాలో జరగవని ఇటీవల వ్యాఖ్యానించి వివాదం రేపిన ఆయన తాజాగా మరో వివాదం సృష్టించారు. వివాహం అనేది ఒక సామాజిక కట్టుబాటు అని, ఈ సిద్ధాంతం ప్రకారం మహిళలు ఇంటి పనులకే పరిమితం కావాలని ఆయన వ్యాఖ్యానించారు.

భార్యాభర్తలు సామాజిక కట్టుబాటు సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. ‘నీవు (మహిళ) ఇంటిపనులు చూస్తూ నన్ను సంతృప్తి పరిస్తే నేను (పురుషుడు) నీ అవసరాలు చూస్తూ నీకు రక్షణగా ఉంటాను' అని ఆ కట్టుబాటు చెప్తోంది. అంతేకాదు ఆమె తన విధులను ఎలాంటి భంగం వాటిల్లకుండా నెరవేర్చినంత కాలం అతను ఆమెకు అండగా ఉంటాడని, ఒక వేళ ఆమె ఆ కాంట్రాక్ట్‌ను గౌరవించకపోతే అతను ఆమెను వదిలి పెట్టవచ్చునని ఆయన అన్నారు.

అలాగే భర్త కాంట్రాక్ట్‌ను గౌరవించకపోతే భార్య సైతం అతడిని వదిలిపెట్టి వేరే బంధాన్ని ఎంచుకోవచ్చునని ఆయన అన్నారు. ఆయన శనివారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ ఆ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భగవత్ చేసిన వ్యాఖ్యలపై సిపిఎం నాయకురాలు బృందాకారత్ తీవ్రంగా మండిపడ్డారు.

ఆయన వ్యాఖ్యలు తనకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదని, ఎందుకంటే ఆర్‌ఎస్‌ఎస్ నిజస్వరూపం ఇదేనని అన్నారు. అందుకే ఆర్‌ఎస్‌ఎస్ అంటేనే ‘తిరోగామి కూటమి' అని తాను భావిస్తున్నానని ఆమె అన్నారు. ఇలాంటి భావాలున్నందువల్లనే బిజెపి అధికారంలో ఉన్నప్పుడు వాళ్లు ‘మనుస్మృతి' ఆధారంగా కొత్త రాజ్యాంగాన్ని రూపొందించాలని కోరినట్లు తెలిపారు.

భారతీయ వివాహ వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని భగవత్ చేసిన వ్యాఖ్యలను భూతద్దంలో చూపించి వక్రీకరించడం తప్పంటూ ఆర్‌ఎస్‌ఎస్ ఆయనను వెనకేసుకు వచ్చింది. పాశ్చాత్య వివాహ వ్యవస్థ ఒక కాంట్రాక్ట్ లాంటిదని, అక్కడ స్ర్తిపురుషులు వివాహాన్ని ఒక కాంట్రాక్ట్‌గా పరిగణిస్తారని, అదే మన భారతీయ వివాహ వ్యవస్థ ఎంతో పవిత్రమైందని కూడా భగవత్ చెప్పారని ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధి రామ్ మాధవ్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+