ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి అక్బరుద్దీన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Akbaruddin Owaisi
ఆదిలాబాద్/హైదరాబాద్: ద్వేషపూరిత వ్యాఖ్యలపై ఆరెస్టయిన మజ్లీస్ శానససభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీని ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ కోర్టు ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. విచారణ నిమిత్తం అక్బరుద్దీన్‌ను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ నిర్మల్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు అంగీకరించింది.

రేపు శనివారం పది గంటల నుంచి 17వ తేదీ ఉదయం పది గంటల వరకు అక్బరుద్దీన్‌ను కోర్టు పోలీసు కస్డడీకి అప్పగించింది. 17వ తేదీ ఉదయం పది గంటల తర్వాత తమ ముందు అక్బరుద్దీన్‌ను ప్రవేశపెట్టాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. ద్వేషపూరిత వ్యాఖ్యలకు సంబంధించి తమ విచారణలో అక్బరుద్దీన్ గొంతును సరిపోల్చుకునే అవకాశం ఉంది.

ఇదిలావుంటే, అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదు చేయాలని హైదరాబాదులోని నాంపల్లి కోరటు మంగళహాట్ పోలీసులను ఆదేశించింది. కేసుపై దర్యాప్తు చేసి ఫిబ్రవరి 11వ తేదీలోగా తమకు నివేదిక సమర్పించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. అక్బరుద్దీన్‌పై హైదరాబాద్ కార్పోరేటర్ రాజాసింగ్ చేసిన ఫిర్యాదు మేరకు కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

అదిలాబాద్ సబ్ జైలులో ఉన్న మజ్లిస్ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీకి శుక్రవారం కడుపు నొప్పి వచ్చింది. జిల్లా జడ్జి మధుసూదన్ మధ్యాహ్నం జైలును సందర్శించారు. ఈ సమయంలో అక్బరుద్దీన్ తనకు కడుపు నొప్పి వచ్చిందని జడ్జికి తెలియజేశారు. దీంతో ఆ జడ్జి వెంటనే రిమ్స్ వైద్యులను రప్పించి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అక్బరుద్దీన్‌కు వైద్యులు చికిత్స అందించారు. అజీర్తి కారణంగా అక్బర్‌కు కడుపు నొప్పి వచ్చిందని వైద్యులు తెలిపారు.

మరోవైపు ప్రత్యేక కేటగిరీ ఖైదీగా పరిగణించాలన్న అక్బరుద్దీన్ పిటిషన్ పైన విచారణను కోర్టు ఈ నెల 16వ తేదికి వాయిదా వేసింది.

English summary
Adilabad district Nirmal court has ordered five days police custody for MIM MLA Akbaruddin Owaisi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X