ఉస్తాద్‌కు ధురంధర్ డెంటు పెట్టేసాడుగా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవైటెడ్ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను రాబడుతోంది. సినిమా విడుదలైన తొలి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించినప్పటికీ.. రెండో రోజు కలెక్షన్లు భారీగా పడిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ మధ్య బాక్సాఫీస్ యుద్ధం మొదలైనట్లుగా తెలుస్తోంది. భారీ అంచనాలతో విడుదలైన 'ఉస్తాద్ భగత్ సింగ్' వసూళ్లపై 'ధురంధర్ 2' ప్రభావం ఉందని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

రెండో రోజు భారీగా పడిపోయిన కలెక్షన్లు
మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.31.7 కోట్ల షేర్(జీఎస్టీతో కలిపి) సాధించిన 'ఉస్తాద్ భగత్ సింగ్'.. రెండో రోజున అనూహ్యంగా పడిపోయింది. శనివారం నాడు కేవలం రూ.6 కోట్ల షేర్‌ను మాత్రమే వసూలు చేయగలిగింది. దీంతో 'ఉస్తాద్ భగత్ సింగ్' రెండు రోజుల మొత్తం కలెక్షన్లు రూ.38 కోట్ల షేర్ వద్ద నిలిచాయి. ఈ చిత్రం థియేట్రికల్ హక్కులు సుమారు రూ.127 కోట్లకు అమ్ముడయ్యాయి. రెండు రోజుల కలెక్షన్ల తర్వాత రికవరీ కేవలం 30 శాతం మాత్రమే ఉంది. కొనుగోలుదారులు లాభాల్లోకి రావాలంటే ఇంకా రూ.89 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు తప్పవనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Ustaad Bhagat Singh Day 2 Collections Huge Drop as Dhurandhar 2 Dominates Box Office

ప్రేక్షకుల మొగ్గు ఎటువైపు?
'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రానికి మిశ్రమ స్పందన రావడం, సినిమా కంటెంట్, డైలాగ్ డెలివరీపై సోషల్ మీడియాలో వస్తున్న నెగటివ్ ట్రోలింగ్ కలెక్షన్లు తగ్గడానికి ప్రధాన కారణమైంది. ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోని మల్టీప్లెక్స్‌లలో కూడా 'ధురంధర్ 2'కు ఆదరణ లభిస్తుండటంతో 'ఉస్తాద్ భగత్ సింగ్'కు స్క్రీన్లు తగ్గడం వసూళ్లపై దెబ్బకొట్టింది.

వీకెండ్‌పైనే ఉస్తాద్ ఆశలు
వీకెండ్ కావడమే కాకుండా రంజాన్ సెలవు దినం ఉండటంతో మూడో, నాలుగో రోజు వసూళ్లు పుంజుకుంటాయని 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా కొనుగోలుదారులు ఆశిస్తున్నారు. ఈ రెండు రోజుల్లో భారీగా వసూళ్లు కనిపిస్తేనే సినిమా గట్టెక్కే అవకాశం ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+