వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సొలిసిటర్ జనరల్ రోహింటన్ నారిమన్ రాజీనామా

By Srinivas
|
Google Oneindia TeluguNews

RF Nariman
న్యూఢిల్లీ: భారత సొలిసిటర్ జనరల్ రోహింటన్ ఎఫ్ నారిమన్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. నారిమన్ 2011 జూలైలో భారత సొలిసిటర్ జనరల్‌గా కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడ్డారు. నారిమన్ కంటే ముందు ఆ పదవిలో గోపాల్ సుబ్రహ్మణియన్ ఉండేవారు. ఆయన తర్వాత నారిమన్ నియమించబడ్డారు. సంవత్సరంన్నర తర్వాత ఆయన ఆ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు కారణాలు తెలియరానప్పటికీ న్యాయశాఖమంత్రితో విభేదాలే కావొచ్చుననే ప్రచారం జరుగుతోంది.

జస్టిస్ రమణపై పిటిషన్ కొట్టివేత

జస్టిస్ ఎన్వీ రమణ పైన దాఖలైన పిటిషన్‌ను జాతీయ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కొట్టివేసింది. దురుద్దేశ్యంతో పిటిషన్ దాఖలైనట్లుగా భావిస్తున్నామని కోర్టు ఈ సందర్భంగా చెప్పింది. నిజానిజాలు, అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్న తర్వాతనే పిటిషన్‌ను కొట్టి వేస్తున్నట్లు కోర్టు పేర్కొంది.

కామన్వెల్త్ క్రీడలు- కల్మాడీపై అభియోగాలు

కామన్వెల్తు క్రీడల కుంభకోణం కేసులో ఒలింపిక్స్ సంఘం మాజీ అధ్యక్షుడు సురేష్ కల్మాడీ సహా ఇతరుల పైన ఢిల్లీ కోర్టు అభియోగాలు నమోదు చేసింది. మోసం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు నమోదయ్యాయి. కేసు విచారణను కోర్టు ఈ నెల 20వ తేదికి వాయిదా వేసింది.

English summary
Rohinton F Nariman resigned on Monday as the Solicitor General of India. The reason behind his resignation is not known yet. Nariman was appointed as the Solicitor General by the government in July 2011.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X