భార్యపై అనుమానం: డిఎన్ఎ రిపోర్టు కేసు కేసు మలుపు

హైదరాబాదులోని సెంటర్ ఫర్ సెల్యులార్ మోలిక్యులార్ బయోలజీ (సిసిఎంబి) పేర ఉన్న డిఎన్ఎ రిపోర్టును చూపించి బిడ్డకు తాను బయోలాజికల్ ఫాదర్‌ను కాదంటూ భార్యపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమెను వదిలించుకోవడానికి ఓ హోమియోపతి వైద్యుడు ప్రయత్నిస్తున్నాడు. ఈ సంఘటన హైదరాబాదులోని సరూర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో గత నెలలో జరిగింది.
డిఎన్ఎ పరీక్షల్లో తల్లీబిడ్డల శాంపిల్స్ మాత్రమే మ్యాచ్ అయ్యాయని సిసిఎంబి చెప్పింది. మరో రక్తం నమూనా మ్యాచ్ కాలేదని చెప్పింది. అయితే, రక్తనమూనాలను తాము సేకిరంచలేదని, తాము సేకరించిన రక్తం నమూనాలతో జరిపిన డిఎన్ఎ పరీక్షల నివేదిక మాత్రమే చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. తాము ఎవరి వద్ద కూడా రక్తనమూనాలను సేకరిచంలేదని చెప్పింది.రమేష్‌దని చెబుతున్న రక్తం నమూనా ఆయనదో, కాదో తమకు తెలియదని చెప్పింది. చెల్లని డిఎన్ఎ నివేదికను రమేష్ తనకు అనుకూలంగా మలుచుకున్నాడని చెప్పింది.
భార్యాబిడ్డల రక్తాన్ని ఓ ప్రైవేట్ టెక్నీషియన్ ద్వారా రహస్యంగా తీయించి, సిసిఎంబిలో డిఎన్ఎ పరీక్ష చేయించానంటూ రమేష్ చెప్పాడు. తన భార్య యమునకు పుట్టిన బిడ్డకు తాను తండ్రిని కాదని అంటూ ఆమెను వదిలించుకోవడానికి ప్రయత్నించాడు. రమేష్ హోమియోపతి వైద్యుడు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలానికి చెందిన యమునతో అదే జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని రమేష్‌కు 22 ఏళ్ల క్రితం పెళ్లయింది. అయితే, వారికి చాలా కాలం పిల్లలు పుట్టలేదు. ఇటీవల యుమన ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన నాలుగైదు రోజులు రమేష్ బాగానే ఉన్నాడు. ఆ తర్వాత యమునపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమెకు మరో వ్యక్తితో వైవాహికేతర సంబంధం ఉందంటూ ఆరోపించడం ప్రారంభించాడు.
తనను రమేష్ మానసికంగా, శారీరకంగా హింసిస్తూ తనను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని యమున రమేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడనికి కూడా ప్రయత్నించాడని ఆమె రమేష్‌పై ఫిర్యాదు చేసింది.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications