వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నారాయణకు కెసిఆర్ కౌంటర్: ప్రధాని వ్యాఖ్యలపై వెనక్కి

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
కరీంనగర్: తనపై విమర్శలు చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్సి నారాయణ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం కరీంనగర్ జిల్లాలో స్పందించారు. ఓట్లు - సీట్లతో తెలంగాణ తేలదన్న నారాయణ వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని చెప్పారు. తనపై చేసిన విమర్శలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.

15 పార్లమెంటు స్థానాల్లో తెరాస గెలిస్తే పార్లమెంటును గడగడలాడించ వచ్చునని, 100 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే తెలంగాణపై తీర్మానాన్ని ఎవరూ అడ్డుకోలేరని కెసిఆర్ అన్నారు. ఎన్నికలలో తెరాస ఓడిపోతే తెలంగాణవాదం లేదని ప్రచారం చేస్తారని అన్నారు. అందుకే ఏ ఎన్నికలు వచ్చినా తెరాస నేతలను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు సూచించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తమ తఢాకా ఏమిటో చూపిస్తామన్నారు.

హైదరాబాదుతో కూడిన తెలంగాణ కోసం తాము పోరాటం చేస్తున్నామన్నారు. ఓట్లు, సీట్లతోనే తెలంగాణకు సంబంధం ఉందన్నారు. దేశంలో ఏక పార్టీ పాలన పోయిందని చెప్పారు. పవార్‌ను తెలంగాణ గురించి అడిగితే బెస్ట్ అఫ్ లక్ అని చెప్పారన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పైన తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఫ్యూన్‌కు తెలిసిన విషయం ఆయనకు తెలియదా అని మాత్రమే అన్నానని చెప్పారు.

పార్లమెంటులో ఎవరైనా కలిస్తే నమస్తే అంటే తాను మాత్రం జై తెలంగాణ అంటానని చెప్పారు. తెలంగాణ సాధనే మా ధ్యేయం, గమ్యం అన్నారు. వచ్చే పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాలను స్తంబింప చేస్తామన్నారు. సీట్ల ద్వారానే తెలంగాణ వస్తుందన్నారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల్లో సుధాకర్ రెడ్డి, స్వామి గౌడ్, వరదారెడ్డిని గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి మహమూద్ అలీ అని చెప్పారు.

English summary
TRS chief K Chandrasekhar Rao condemned CPI's Narayana comments against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X